‘Avengers Endgame​’ దెబ్బ మాములుగా లేదుగా.. బాక్సాఫీస్ ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోన్న మూవీ..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన అవెంజర్స్ హంగామా నడుస్తోంది. ఈ సినిమా దెబ్బకు అన్ని రికార్డులు మటాష్ అవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వాల్డ్ వైడ్‌గా వేలు కోట్లను కొల్లగొట్టింది.

news18-telugu
Updated: April 29, 2019, 6:56 PM IST
‘Avengers Endgame​’ దెబ్బ మాములుగా లేదుగా.. బాక్సాఫీస్ ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోన్న మూవీ..
అవెంజర్స్ మూవీ పోస్టర్
news18-telugu
Updated: April 29, 2019, 6:56 PM IST
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన అవెంజర్స్ హంగామా నడుస్తోంది. ఈ సినిమా దెబ్బకు అన్ని రికార్డులు మటాష్ అవుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వాల్డ్ వైడ్‌గా వేల కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా మూడు రోజుల్లో 1.2 బిలయన్ డాలర్లు రాబట్టింది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.8,384 కోట్లు వసూలు చేసి తన పేరున సరికొత్త చరిత్ర లిఖించుకుంది. అంతేకాదు విడుదలైన ప్రతి చోట అన్ని రికార్డులను తిరగరాస్తోంది. ఒక్క అమెరికా,కెనడాలో గురువారం ప్రీమియర్స్ నుంచి ఆదివారం వరకు 350 మిలియన్ డాలర్లు రాబట్టినట్టు సమాచారం. అదే విధంగా చైనా, బ్రెజిల్,ఫ్రాన్స్ వంటి 38పైగా దేశాల్లో అవెంజర్స్ వసూళ్ల ప్రభంజాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం.

avengers endgame 3days world wide box office collections,avengers endgame,avengers endgame box office collection,avengers endgame collection,avengers endgame review,avengers endgame worldwide collection,avengers endgame collection worldwide,avengers endgame box office,avengers endgame trailer,box office collection of avengers endgame,avengers endgame collections,avengers endgame public review,avengers endgame day1 collections,avengers endgame day3 collections,avengers endgame 3 days collections,avengers endgame india collectionsavengers endgame indian box office collections,avengers endgame 3 days indian box office collections,,hollywood,bollywood,అవెంజర్స్ ఎండ్‌గేమ్,అవెంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్స్,అవెంజర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్,అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఇండియా కలెక్షన్స్,అవెంజర్స్ ఎండ్‌గేమ్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్,
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)


ఒక్క చైనాలో దాదాపు 330 మిలియన్ డాలర్స్ వసూళు చేసినట్టు అక్కడి బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినీ ప్రేక్షకులు ఈ సినిమా ఎండింగ్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఈ సినిమా చూసారు. మన దేశం విషయానికొస్తే..ఈ సినిమా 2845 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రూ.157.20 కోట్లు వసూలైనట్టు ఇక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రూ.53.10 కోట్లు, శనివారం 51.40 కోట్లు, ఆదివారం 52.70 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆంటోని రుస్సో,జో రుస్సో, ఈ సినిమాకు డైరెక్ట్ చేసారు. మొత్తానికి మొదటి మూడు రోజుల్లోనే ఇంత వసూళ్ల అరాచకం ఉంటే..ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వసూళు చేస్తుందనేది చూడాలి.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...