అబ్బురపరుస్తున్న మార్వెల్ అవెంజర్స్ 4 ట్రైలర్

చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ వచ్చేసింది.

news18-telugu
Updated: December 8, 2018, 6:05 AM IST
అబ్బురపరుస్తున్న మార్వెల్ అవెంజర్స్ 4 ట్రైలర్
అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ వచ్చేసింది
  • Share this:
చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ వచ్చేసింది. మార్వెల్ స్టూడియో, ఈ ట్రైలర్‌ను ఈ నెల 5నే విడుదల చేయాలని నిర్ణయించింది అయితే సినియర్ బుష్ చనిపోవడంతో రెండు రోజులు ఆగీ, నిన్న విడుదల చేసినట్లు చెబుతున్నారు.

విడుదలైన అవెంజర్స్ 4 ట్రైలర్ రెండు నిమిషాల వ్వవదిలో వుంది. ట్రైలర్‌లో టోనీ స్టార్క్ నిస్సాయతతో తన సందేశాన్ని పెప్పర్ పాట్స్‌కు  చేరే విధంగా రికార్డ్ చేస్తున్నట్లు కనబడుతుంది. తర్వాత మనం థానోస్‌ను టైటాన్ 2తో నడవడాన్ని చూడోచ్చు. మొత్తం మీద ఈ ట్రైలర్‌లో కొన్ని అబ్బురపరిచే సన్నివేశాలతో పాటు, నిస్సాయతతో ఉన్న అవెంజర్స్‌ను చూడోచ్చు. అంతేకాకుండా ఈ ట్రైలర్‌లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికాతో పాటు హాక్ఐ, థోర్, బ్లాక్ విడో, హల్క్ నెబ్యులలను చూపిస్తున్నారు.

ఇంతవరకు వచ్చిన సినిమాల్లో బ్లాక్ పాంథర్, స్పైడర్ మాన్, నిక్ ఫ్యూరీ, డాక్టర్ స్ట్రేంజ్, స్కార్లెట్ విచ్‌లను థానోస్ చంపింది తెలిసిందే. ఇంకా మిగిలింది కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, హల్క్. మరీ వచ్చే అవెంజర్స్4 సినిమాలో వీళ్లు కూడా చస్తారా... లేక ఈ అందరు కలసి థానోస్‌ను చంపబోతున్నారో చూద్దాం.

మార్వెల్ అవెంజర్స్ 4 ట్రైలర్‌ను చూడండి.

ఇదీ కూడా చూడండి.

 Photos: హాట్ బ్యూటీ రిచా చడ్డ లేటెస్ట్ ఫోటోస్

First published: December 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>