హోమ్ /వార్తలు /సినిమా /

బాహుబలి రికార్డ్‌ బద్దలు.. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు..

బాహుబలి రికార్డ్‌ బద్దలు.. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు..

బాహుబలి 2: 1810 కోట్లు

బాహుబలి 2: 1810 కోట్లు

అవెంజర్స్ ఎండ్ గేమ్..ఇదివరకు ఎప్పుడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లను రాబడుతోంది.

  అవెంజర్స్ ఎండ్ గేమ్..ఇదివరకు ఎప్పుడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లను రాబడుతోంది. ఈ హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్ వచ్చినంత బజ్.. ఇప్పటి వరకు ఏ విదేశీ సినిమాకు రాలేదు. దీంతో భారీ సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దానికి తగ్గట్టుగానే.. రిలీజైన ప్రతీచోట భారీ వసూళ్లను నమోదుచేస్తూ సంచలనాలను స‌ృష్టిస్తోంది. ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే.. ఇండియా వైడ్‌గా రూ. 53.10 కోట్లు నమోదు చేసింది. అంతేకాకుండా.. వీకెండ్ కావడంతో శనివారం కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గకుండా.. 60 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రెండు రోజులకే రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. ఈ సినిమాను దేశం మొత్తం 2845 స్క్రీన్లలో విడుదల చేశారు.

  అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్టర్

  అయితే సినిమాకు సూపర్ బజ్ రావడంతో విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొడుతోంది. హిందీలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ ఓపెనర్‌గా ఉన్న 'థగ్స్ ఆఫ్ హిందోస్తాన్' రికార్డులను 'అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' బ్రేక్ చేసేసింది. థగ్స్.. తొలి రోజు రూ. 52.25 కోట్లు వసూలు చేయగా.... 'ది ఎండ్ గేమ్' రూ. 53.10 కోట్లు రాబట్టింది. అంతేకాదు బాహుబలి సినిమా మూడు రోజుల్లో 100 కొట్లు రాబడితే..ఈ అవెంజర్స్ మాత్రం  ఆ ఫీట్‌ను రెండు రోజుల్లోనే సాధించి ఇంతకు ముందున్న బాహుబలి రికార్డ్‌ను బద్దలుకొట్టింది.

  అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్టర్

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Anushka Shetty, Avengers Endgame, Bahubali, Bollywood news, Hindi Cinema, Hollywood, Hollywood News, International, Karan Johar, Prabhas, Rana, SS Rajamouli, Tamannah, Tamil Cinema, Tamil Film News

  ఉత్తమ కథలు