Avatar: ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మొదలు పెడితే.. హాలీవుడ్‌లో తెరకెక్కిన పాత క్లాసిక్ సినిమాలను మళ్లీ విడుదల చేయడం అనేది రివాజుగా మారింది. ఈ యేడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘పోకిరి’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు చిరు బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఘరానా మొగుడు’ మూవీకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘అవతార్’ సినిమాను మళ్లీ థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన విడుదల చేసారు. ఇక అవతార్ ఈ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమా. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఓ అద్భుతం ‘అవతార్’. ఈ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే..అందులోని వింతల్ని, కొత్త ప్రపంచాల్ని మరిచిపోలేరు.
2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక కొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఇలాంటి లోకం కూడా ఒకటి ఉంటుందా అనే విధంగా జేమ్స్ కామెరాన్.. విజువల్స్‌తో వండర్ చేశాడు.ఇప్పటికీ అవతార్ బాక్సాఫీస్ రికార్డ్ ను అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్రేక్ చేసినా.. చాలా చోట్ల అవతార్ సాధించిన రికార్డులు ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉందంటే అది ఏ స్థాయి విజయమో అంచనా వేయొచ్చు. తాజాగా ఈ సినిమాను 4K High Dynamic Range లో సెప్టెంబర్ 23న మన దేశంలో విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాదు దానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
On September 23 #Avatar returns to the big screen for a limited time only. Watch the new trailer now ???? pic.twitter.com/9REw4umdGW
— Avatar (@officialavatar) August 23, 2022
మన దేశంలో ఈ సినిమాను 20 సెంచరీ స్టూడియో ఇండియా రీ రిలీజ్ చేస్తోంది. జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని 1994లో రాయడం మొదలు పెట్టి షూటింగ్ పూర్తయ్యేవరకు 15 యేళ్లకు పైగా సమయం పట్టింది. దాదాపు 237 మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే 3 బిలియన్ యూఎస్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.
అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. వాటి డేట్స్ కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అవతార్ 2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుంది. అలాగే ఈరోజు (బుధవారం) మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట. అలాగే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయనున్నారట. దీంతో ఆడియెన్స్ ఇప్పుడు ఈ క్రేజీ గ్లిమ్ప్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అవతార్-2తో సీక్వెల్ కాకుండా ఆ తర్వాత అవతార్-3, అవతార్-4, అవతార్ 5 సినిమాలు కూడా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.
Tollywood Stars favorite foods: చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు.. మన హీరోలు ఇష్టంగా తినే ఫుడ్స్ ఇవే.. ?
‘అవతార్’ సినిమాను సంబంధించిన సీక్వెల్స్‌ను డిస్నీ సంస్థ నిర్మిస్తోంది.అవతార్ 3 సీక్వెల్‌ను కూడా 20 డిసెంబర్ 2024లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.2026 డిసెంబర్ 18 ‘అవతార్ 4’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ‘అవతార్ 5’ సినిమాను 22 డిసెంబర్ 2028 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వరుసగా ఐదు సీక్వెల్స్‌ను ప్రకటించడమే కాదు. వాటికి సంబంధించిన రిలీజ్ డేట్స్ ను కూడా ప్రకటించడం విశేషం. ‘అవతార్’ సీక్వెల్స్‌కు సంబంధించిన అన్ని స్క్రిప్ట్ వర్క్ ఎపుడో పూర్తి చేసిన జేమ్స్ కామెరూన్. ఇక అవతార్ 2 షూటింగ్‌ను ఎక్కువగా న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండులోని యూనివర్సల్ స్టూడియోలో షూటింగ్ పూర్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Avatar, Hollywood, James Cameron