Home /News /movies /

AVATAR 2 THE WAY OF WATER TRAILER 2022 RELEASED SB

Avatar 2: అవతార్ 2 ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు... పండోరా లోకంలో మరిన్ని కొత్త వింతలు !

అవతార్ 2 ట్రైలర్ రిలీజ్

అవతార్ 2 ట్రైలర్ రిలీజ్

ట్రైలర్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా మనకు కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం అవుతాయి,

  విజువల్స్ వండర్ అవతార్. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ​(James Cameron) సృష్టించిన అద్భుతం. అద్దంలో చందమామ చూపించే మనకు.. ఏకంగా వెండి తెర మీదే! చందమామపై ఉన్న లోకాన్ని చూపించేశాడు. ఒక్క చందమామ రూపాన్నే కాదు.. చందమామ మీదున్న ప్రపంచాన్నంతా తెచ్చిపెట్టాడు. అదే.. పండోరా లోకం. అవతార్‌కి సీక్వెల్‌.. అవతార్‌ –2! ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. “అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” (Avatar 2)ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఇప్పుడు ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

  2154 సంవత్సరంలో నడిచే అవతార్‌–2 కథలో.. భూమి ఎప్పటిలాగే ఉంటుంది. మనుషులు కూడా అట్లానే ఉంటారు. కానీ, డొల్లగా మారిన భూమి ఎనర్జీ కొరత తీర్చేందుకు.. ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదలపై కార్పొరేట్‌ కంపెనీల కన్నుపడుతుంది. అందులో భాగంగా అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న ‘పండోరా’ గురించి సైంటిస్టులకి తెలుస్తుంది. అదే అవతార్‌–2 కథకు వేదికైంది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా మనకు దర్శనమిస్తోంది. ఈ ట్రైలర్‌ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. అవతార్ 2లో ఈసారి యుద్ధం నీటిలో జరగనున్నట్లు విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ట్రైలర్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో మరోసారి అవతార్ సినిమా సస్పెన్స్‌గానే మారింది.

  ట్రైలర్‌లో విచిత్రమైన చెట్ల జాతులు, ఆరు కాళ్ల రైనోలు, భయంకరమైన థానోటర్‌ మృగాలు, రెక్కల గుర్రాలు, ఎగిరే డ్రాగాన్స్‌ లాంటి టోరక్‌లు మనకు కనిపించాయి. అవతార్‌లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. చెట్లు, జంతువులతో సహా. హోమ్‌ ట్రీ, ట్రీ ఆఫ్‌ సోల్స్‌తో పాటు రకరకాల చెట్లు అవతార్‌కి ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే అవతార్‌లో కనిపించిన ఈ అంశాలతో పాటు మరిన్ని కొత్త వింతలు, విశేషాలు కూడా అవతార్ 2లో మనల్ని అలరించనున్నాయి.

  2009లో జేమ్స్​ కామెరాన్​(James Cameron) 'అవతార్'​ సినిమాను తీశాడు. దీనికి సీక్వెల్​గా వస్తున్న మూవీకి 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'​గా టైటిల్​ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీ ట్రైలర్​ను 'డాక్టర్​ స్ట్రేంజ్:​ ఇన్​ ది మల్టీవర్స్​ ఆఫ్​ మ్యాడ్​నెస్'​ సినిమా విడదల రోజైన మే 6న థియేటర్లలో ప్రదర్శించారు. తాజాగా యూట్యూబ్‌లో అవాతార్ 2 ట్రైలర్‌ను రీలీజ్ చేశారు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Hollywood, Hollywood News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు