హోమ్ /వార్తలు /సినిమా /

Avatar 2: అవతార్ 2 భారీ బిజినెస్.. తెలుగులో ఎన్నికోట్లంటే...!

Avatar 2: అవతార్ 2 భారీ బిజినెస్.. తెలుగులో ఎన్నికోట్లంటే...!

మళ్లీ విడుదల కానున్న అవతార్ (Twitter/Photo)

మళ్లీ విడుదల కానున్న అవతార్ (Twitter/Photo)

2009లో హాలీవుడ్​ లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్​(James Cameron) సృష్టించిన గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'​.దీనికి సీక్వెల్​గా వస్తున్న మూవీకి 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'​గా టైటిల్​ పెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

 అవతార్ ఈ సినిమాను సినీ ప్రియులెవరూ మరిచిపోలేరు. తన గ్రాఫిక్స్‌తో కొత్త ప్రపంచమే ప్రేక్షకులకు చూపించాడు... హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. “అవతార్” ద్వారా సినీ ప్రియులకు  ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” (Avatar 2)  విడుదలకు సిద్ధమవుతోంది.

2009లో హాలీవుడ్​ లెజండరీ డైరెక్టర్​ జేమ్స్​ కామెరాన్​(James Cameron) సృష్టించిన గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'​.దీనికి సీక్వెల్​గా వస్తున్న మూవీకి 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'​గా టైటిల్​ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ  సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.

తాజాగా అవతార్ సినిమా రీజనల్ లాంగ్వేజ్ ‌కు భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నట్లు ట్రేడ్ టాక్. తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు 120 కోట్లు వరకు రేటు పలుకుతున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరు ముగ్గురు కలిసి అవతార్ సినిమాను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ ఉంటాయని, ముప్పై నుంచి నలభై కోట్ల దాకా రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో వంద కోట్లుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.

అయితే ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ విడుదలకు ముందే అరుదైన రికార్డును క్రియేట్ చేయడం విశేషం. “అవతార్-2” ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఇదొక అపూర్వమైన రికార్డు అని చెప్పొచ్చు. ఇన్ని భాషల్లో ఇప్పటి వరకు ఇతర సినిమాలేవీ విడుదల కాలేదు.

First published:

Tags: Avatar, Hollywood News

ఉత్తమ కథలు