Home /News /movies /

AVASARALA SRINIVAS NOOTOKKA JILLALA ANDAGADU TRAILER REVIEW TA

Avasarala Srinivas: బట్టతలతో అవసరాల శ్రీనివాస్ తిప్పలు.. ’నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ రివ్యూ..

’నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ రివ్యూ (Twitter/Photo)

’నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ రివ్యూ (Twitter/Photo)

Avasarala Srinivas - Nootokka Jillala Andagadu Trailer Review : నూటొక్క జిల్లాల అందగాడు’ అంటూ అవసరాల శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన  ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    Avasarala Srinivas - Nootokka Jillala Andagadu : నూటొక్క జిల్లాల అందగాడు’ (Nootokka Jillala Andagadu) అంటూ ఒకప్పటి విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ ఊత పదంతో అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన  ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అష్టా చెమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్.. మంచి నటుడిగా.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు యాక్టర్‌గా ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన బట్టతల ఇతివృత్తంలో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా చేసారు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి  విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

    తాజాగా విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్.. గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు.  గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలకు పట్టం కడుతున్నారు. తాజాగా బట్టతల కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతల కాన్సెప్ట్‌తో ‘బాలా’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ఆ కథను ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. అందులో ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నటనకు మంచి మార్కులే కొట్టేసారు.


    తాజాగా అవసరాల శ్రీనివాస్ కూడా అదే బట్టతల ఇతివృత్తంతో ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా చేసారు.ఈ సినిమాలో యువకులకు బట్టతల వస్తే కలిగే ఇబ్బందులను ఎంతో ఫన్నిగా చూపించారు. అంతేకాదు బట్టతల ఉన్న యువకులు పెళ్లి కావడానికి ఎలాంటి ఇబ్బందులు పడతానేది ఈ సినిమాలో చూపించడం ఆలోచింప చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘ఇవ్వటానికి బట్టతల తప్ప ఏమి లేనపుడు ఎందుకు కన్నట్టమ్మ’ అంటూ గొత్తి సూర్యనారాయణ పాత్రలో అవసరాల శ్రీనివాస్ చెప్పిన డైలాగ్.. బట్ట తల వల్ల బాధపడే వారి బాధలను కళ్లకు కట్టారు. ఈ సినిమాను కామెడీతో పాటు ఎమోషనల్‌‌ను అదే స్థాయిలో చూపించడంలో దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ సక్సెస్ అయ్యారు. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీతో ఈయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించారు.

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..


    టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు‌ (Dil Raju)తో పాటు క్రిష్ (Krish) ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా వై.రాజీవ్ రెడ్డి, జె.సాయి బాబు, శిరీస్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా బట్టతల వల్ల కలిగే ఇబ్బందులతో అవసరాల శ్రీనివాస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Avasarala Srinivas:, Krish, Nootokka Jillala Andagadu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు