Home /News /movies /

AUTO RAMPRASAD SHOCKING ACT IN JABARDASTH ON SEEING DHEE TROLL IN JABARDASTH PROMO NR

Auto Ramprasad: కెమెరాలకు దండం పెట్టిన ఆటో రామ్ ప్రసాద్.. ఏం జరిగిందంటే?

jabardasth auto ramprasad

jabardasth auto ramprasad

Auto Ramprasad: బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎంతోమంది కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకుంటారు. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటారు.

    Auto Ramprasad: బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎంతోమంది కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకుంటారు. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటారు. మామూలు వ్యక్తులుగా పరిచయమై స్టార్ కమెడియన్ గా ఎదుగగా అందులో ఒకరు ఆటో రామ్ ప్రసాద్ కూడా ఉన్నాడు. తన పంచులతో తెగ నవ్విస్తుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా కెమెరాలకు దండం పెడుతూ కనిపించాడు.

    జబర్దస్త్ లో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, సన్నీ వాళ్లతో కలిసి స్కిట్ లు చేస్తూ తన కామెడీతో బాగా ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా ఆటో పంచులతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆటో రామ్ ప్రసాద్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కెమెరాలకు దండం పెడుతూ కనిపించాడు రామ్ ప్రసాద్. ఇంతకీ అసలేం జరిగిందంటే.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది.

    అందులో కమెడియన్స్ అందరూ తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. ఇక ఇందులో కెవ్వు కార్తీక్ స్కిట్ లో బుల్లితెర నటి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ పెళ్లి అయ్యిందని కాస్త జలసీ గా ఫీల్ అయినట్లు కనిపించింది. వెంటనే రోజా ఆ పాయింట్ అందుకొని.. కార్తీక్.. నీకు పెళ్లి అయిందని అమ్మాయి కొంచెం నర్వస్ గా ఉంది అనడంతో.. వెంటనే ఆ అమ్మాయి నేనేం నర్వస్ గా లేను.. వాడే నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పింది.



    కానీ ఈ డైలాగ్.. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో ఓ డాన్సర్ మాట్లాడిన మాటలను తీసుకొని వీళ్ళు కూడా అలాగే మాట్లాడారు. అలా స్కిట్ కాస్త ఓవర్ గా కనిపించడంతో.. వెంటనే ఆటో రామ్ ప్రసాద్ కాపాడండోయ్ నన్ను అనే మీమ్స్ డైలాగుతో కెమెరా ముందుకు వచ్చి దండం పెట్టాడు. ఇక దీంతో అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు. ఇక స్కిట్ అనంతరం కూడా మరో కమెడియన్ కూడా ఆల్రెడీ ఢీ లో చూశాము.. ఇక్కడ కూడా అవసరమా అంటూ పంచ్ వేసాడు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Auto ramprasad, Dhee troll, Getup srinu, Jabardasth, Kevvu karthik, Sudigali sudheer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు