Home /News /movies /

AUTO RAM PRASAD MOVIE PEEP SHOW TEASER RELEASE SB

Auto Ram Prasad: అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే... ఆటో రామ్ ప్రసాద్ పీప్ షో.. టీజర్ విడుదల..!

పీప్ షో ట్రైలర్ రిలీజ్

పీప్ షో ట్రైలర్ రిలీజ్

పీప్ షో టీజర్ రిలీజ్ చేశారు. ఈసినిమాలో హీరోగా జబర్దస్త్ ప్రముఖ కమెడియన్ ఆటో రాం ప్రసాద్ నటిస్తున్నాడు.

    సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.

    జబర్దస్త్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న "పీప్ షో" చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్.



    "పీప్ షో" చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీరాగ్, సంధ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జబర్దస్త్ సూపర్ స్టార్స్ లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే మూవీ మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


    ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్‌లో చూస్తే  గోడకు ఉన్న మేకు తీస్తూ ఆటో రామ్ ప్రసాద్ కనిపిస్తాడు. అయితే ఆ మేకు ఊడిపోగానే.. గోడకు కన్నం ఏర్పాడి.. అవతలి రూంలో ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె బట్టలు మార్చుకుంటుంటే..రామ్ ప్రసాద్ ఆమెనే చూస్తుంటాడు. టీజర్‌లో మనకు ఇదే కనిపిస్తుంది. ఇక ఆమెను దొంగచాటుగా తొంగి చూస్తూ ఉంటాడని మనకు ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమా పేరు కూడా అదే. పీప్ షో.. అంటే దొంగచాటుగా తొంగి చూడటమే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Auto ram prasad, Auto ramprasad, Extra jabardasth, Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు