మహేష్ బాబు డాన్స్‌తో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్..

David Warner: ఐపిఎల్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో పాపం డేవిడ్ వార్నర్‌కు ఏం చేయాలో తెలియక టిక్ టాక్‌లు చేసుకుంటూ కూర్చున్నాడు. గ్రౌండ్‌లో దిగి బౌలర్ల మైండ్ బ్లాక్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2020, 2:44 PM IST
మహేష్ బాబు డాన్స్‌తో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్..
డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ (david warner mind block)
  • Share this:
ఐపిఎల్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో పాపం డేవిడ్ వార్నర్‌కు ఏం చేయాలో తెలియక టిక్ టాక్‌లు చేసుకుంటూ కూర్చున్నాడు. గ్రౌండ్‌లో దిగి బౌలర్ల మైండ్ బ్లాక్ చేసే ఈయన ఇప్పుడు ఇంట్లో కూర్చుని పెళ్లాం పిల్లలతో కలిసి మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేసాడు. ముందు నుంచి ఎందుకో తెలియదు కానీ తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసాడు ఈయన. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరు హీరోలను ఫాలో అయిపోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కావడంతో ఇక్కడే మకాం వేసాడు డేవిడ్. దాంతో తెలుగు వాళ్లకు బాగా చేరువవుతున్నాడు ఈయన.

డేవిడ్ వార్నర్ (TikTok/Instagram/Photo)
డేవిడ్ వార్నర్ (TikTok/Instagram/Photo)


ఐపిఎల్ లేకపోయినా తెలుగు ఆడియన్స్‌ మనసులు దోచుకుంటున్నాడు వార్నర్. ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసాడు ఈ క్రికెటర్. అచ్చంగా మహేష్ బాబు చేసిన స్టెప్పులనే భార్యతో కలిసి చిందేసాడు డేవిడ్. ఇది పర్ఫెక్టుగా రావడానికి తనకు 50 సార్లు పట్టిందని చెప్పుకొచ్చాడు ఈయన. View this post on Instagram
 

After 50 attempts and will show a video of the attempts later we almost got there. Haha thoughts?? #mindblock @urstrulymahesh


A post shared by David Warner (@davidwarner31) on

ఈ మధ్య కాలంలో డేవిడ్ వార్నర్ వేసిన బెస్ట్ స్టెప్స్ కూడా ఇవే. ఈయన్నిలాగే వదిలేస్తే తెలుగు సినిమాల్లోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నాడు కూడా. పైగా పోకిరి సినిమా డైలాగ్ చెప్పినపుడు పూరీ జగన్నాథ్ చూసి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తానని చెప్పాడు. మొత్తానికి ఇప్పట్లో క్రికెట్ మొదలు కాకపోతే సినిమాల్లోకి వచ్చేస్తాడేమో మరి..?
First published: May 30, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading