news18-telugu
Updated: May 12, 2020, 7:01 PM IST
అల్లు అర్జున్ రాములో రాములా సాంగ్‌కు డాన్స్ చేసిన డేవిడ్ వార్నర్ (Twitter/Photo)
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య భారతీయ సినిమాలపై.. అందులో తెలుగు చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేసాడు డేవిడ్. ఈయన చేసిన పాటకు అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. సూపర్ డేవిడ్ అంటూ అందరు ఆయన్ని పొగడ్తలో ముంచెత్తారు. ఆ తర్వాత కమల్ హాసన్ పాటకు కూడా స్టెప్పులేసాడు. ఆపై 14 ఏళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు. దక్షిణాది ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలకు ఫిదా అవుతున్నారు. పూరీ జగన్నాథ్ మాత్రం వార్నర్ నటనకు ప్లాట్ అయి తన సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేయాలని కోరాడు.దీనికి డేవిడ్ కూడా ప్రయత్నించాను సర్ అంటూ రిప్లై ఇచ్చాడు.
తాజాగా ఇపుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములో పాటకు తన కుటుంబంతో కలిసి చిందేసాడు. రాములో రాములో పాటను తాజాగా అల్లు అర్జున్ కూడా రీ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో డేవిడ్ వార్నర్ ఇపుడు టిక్‌టాక్‌తో టైమ్ పాస్ చేస్తున్నాడు. రానున్న రోజుల్లో ఏయే వీడియోలతో ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలాంటి హల్చల్ చేస్తాడో చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
May 12, 2020, 6:55 PM IST