హోమ్ /వార్తలు /సినిమా /

Nani : ఆ సీన్ హృదయ లోతులను తాకుతుంది.. నాని సినిమాకు ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఫిదా..

Nani : ఆ సీన్ హృదయ లోతులను తాకుతుంది.. నాని సినిమాకు ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఫిదా..

Australian cricket journalist Chloe Amanda bailey praises nani jersey Photo : Twitter

Australian cricket journalist Chloe Amanda bailey praises nani jersey Photo : Twitter

Nani : నాని ప్రధాన పాత్రలో వచ్చిన జెర్సీ సినిమాను చూసిన ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు ప్రశంసల వర్షం కురిపించింది.

నాని ప్రధాన పాత్రలో వచ్చిన జెర్సీ సినిమాను చూసిన ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్టు ప్రశంసల వర్షం కురిపించింది. జెర్సీ సినిమా తనకు ఎంతో నచ్చిందని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆమె తన ట్విట్టర్‌లో రాస్తూ.. జెర్సీ సినిమాలో రైల్వే స్టేషన్‌ సీన్ ఎంతో హృద్యంగా ఉందని తనను ఎంతో ఆకట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది. జెర్సీ సినిమా ఒక అద్భుతమైన భావోద్వేగ పూరిత ప్రయాణం. ఈ సినిమాలో క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించారు. సినిమాను దర్శకుడు ఎంతో బాగా తెరకెక్కించారు. రైల్వే స్టేషన్‌ సన్నివేశం హృదయాలను లోతులను తడుముతుంది.. అని రాసుకున్నారు. అంతేకాదు ఆ ట్వీట్‌లో రైల్వే స్టేషన్‌ సీన్‌‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.. ఆస్ట్రేలియా క్రికెట్‌ జర్నలిస్ట్ క్లోయ్‌ అమందా బెయిలీ. ‘జెర్సీ’ని గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించగా.. శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్’గా నటించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో షాహీద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.

ఇక నాని నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం.. శ్యామ్ సింగ రాయ్.. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చేస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.ఈ సినిమాతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే ఓ అడల్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ని చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

First published:

Tags: Hero nani, Jersey movie, Tollywood news

ఉత్తమ కథలు