• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • AUSTRALIA CRICKET OPENER DAVID WARNER CHANGED AS MEGA STAR CHIRANJEEVI AACHARYA USING REFACE APP VIDEO MHN

David Warner - Chiranjeevi - Aacharya: మెగాస్టార్ ఆచార్యగా మారిన వార్న‌ర్‌.. మెగాభిమానులను ఆకట్టుకుంటోన్న వీడియో

Australia Cricket opner David Warner changed as Mega Star Chiranjeevi Aacharya using reface app video

David Warner - Chiranjeevi - Aacharya: డేవిడ్‌ వార్నర్‌.. సౌత్‌స్టార్స్ సినిమాల్లో కొన్ని స‌న్నివేశాల్లో స‌ద‌రు హీరోల స్థానంలో రీ ఫేస్‌ యాప్‌ ద్వారా త‌న ఫేస్‌ను అతికించి అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆచార్య టీజర్‌ను వార్నర్‌ రీ ఫేస్‌ యాప్‌ ద్వారా ఛేంజ్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు

  • Share this:
    డేవిడ్ వార్న‌ర్‌.. క్రికెట్‌ను ఇష్ట‌ప‌డేవారిలో ఈ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ పేరు తెలియ‌ని వారు ఉండ‌క‌పోవ‌చ్చు. లాక్‌డౌన్ స‌మ‌యంలో డేవిడ్ వార్న‌ర్ సౌత్ సినిమా హీరోల‌ను ఫాలో కావ‌డం మొద‌లు పెట్టాడు. హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌తో క్రికెట్ ఆడ‌టం వ‌ల్ల ఏర్పడిన అనుబంధం కావ‌చ్చు మ‌రేదైనా కావ‌చ్చు. కానీ వార్న‌ర్‌కు ద‌క్షిణాదితో సంబంధం ఏర్ప‌డింది. ఈ కార‌ణంగా ద‌క్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు, త‌మిళ సినిమాల‌కు చెందిన స్టార్ హీరోల సినిమాల్లో పాట‌ల‌కు ఆయ‌న త‌న భార్య‌తో క‌లిసి స్టెప్పులేశాడు. బుట్ట‌బొమ్మ సాంగ్‌లో భార్య‌తో వార్న‌ర్ వేసిన స్టెప్పులు అందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే బాహుబ‌లిలో ప్ర‌భాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేసి త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు వార్న‌ర్‌.

    త‌ర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చాడు పేస్ ఆఫ్ యాప్‌ను ఉప‌యోగించి సౌత్‌స్టార్స్ సినిమాల్లో కొన్ని స‌న్నివేశాల్లో స‌ద‌రు హీరోల స్థానంలో రీ ఫేస్‌ యాప్‌ ద్వారా త‌న ఫేస్‌ను అతికించి అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. 2020 ఏడాదిని ఇలా ముగిస్తున్నాను అంటూ మ‌హేశ్ హీరోగా చేసిన మ‌హ‌ర్షి సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను ఫేస్ ఆఫ్ చేశాడు. అది మ‌హేశ్ అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించింది. అలాగే ద‌క్షిణాదికి చెందిన మ‌రో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన ద‌ర్బార్ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను ఫేస్ ఆఫ్ చేసి వీడియో పోస్ట్ చేశాడు మెప్పించాడు వార్న‌ర్‌.





    అదే కోవ‌లో ఇప్పుడు డేవిడ్ వార్న‌ర్, మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య టీజ‌ర్‌ను రీఫేస్ యాప్‌లో చేంజ్ చేసిన త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసి `క‌మింగ్ సూన్‌` అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేసి మెగాభిమానులను ఆక‌ట్టుకుంటున్నాడు డేవిడ్ వార్న‌ర్‌.
    Published by:Anil
    First published: