పూజా చేసిన పనికి హార్ట్ అవుతున్న అభిమానులు...

పూజా హెగ్డే చేసిన పనికి మెగాభిమానులు హర్ట్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 24, 2020, 6:21 PM IST
పూజా చేసిన పనికి హార్ట్ అవుతున్న అభిమానులు...
పూజా హెగ్డే (Twitter/Photo)
  • Share this:
పూజా హెగ్డే చేసిన పనికి మెగాభిమానులు హర్ట్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ‘అల వైకుంఠపురములో’ తమన్ స్వర పరిచిన సామజవరగమన సాంగ్ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ పాట యూ ట్యూబ్‌ను షేక్ చేసింది.ఏకంగా  14 కోట్లకు పైగా  వ్యూస్‌తో ఇంకా దూసుకుపోతుంది. తన సంగీతంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ ‘అల వైకుంఠపురంలో’ చిత్రాన్ని మరో స్థాయికి తీసువెళ్లాడు. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘అల వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఇటీవల జరిగిన సక్సెస్‌ వేడుకలో హీరోయిన్‌ పూజా హెగ్డేతో ఈ పాట పాడించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఆకట్టుకుంటున్న పూజా ఇలా లైవ్ వేడుకలో పాట పాడే సాహసం చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. వచ్చీ రాని భాషతో పలకలేని పదాలతో ఒక రకంగా పూజా చాలానే తంటాలు పడినా.. తన ప్రయత్నానికి మెచ్చి అంతా చప్పట్లు కొట్టారు. పూజా పాడుతుంటే.. తన వెంటే ఉన్న తమన్ ఆమె పాటకి తగ్గట్టుగా బీట్ అందించాడు.

Instagram


ఇంకా భాషపై పట్టు లేకపోవడంతో కొన్ని పదాల్ని అర్థవంతంగా పలకలేకపోయింది. ఇక పూజ పాడిన ఈ పాట విన్న నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ పూజాను ఏకిపారేస్తున్నారు. రకరకాల మీమ్స్‌ తో వెటకారం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు నేర్చుకో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే .. పూజా ఏంటి మాకి రాత అంటూ వంగ్యం గా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం భాష సరిగా రాకపోయినా... ఆ మాత్రం పూజ పాట పాడేందుకు చేసే ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు