హోమ్ /వార్తలు /సినిమా /

Sathya Raj Fires on Rajinikanth: రాజకీయం ముసుగులో బిజినెస్... రజనీకాంత్ పై సత్యరాజ్ ఫైర్

Sathya Raj Fires on Rajinikanth: రాజకీయం ముసుగులో బిజినెస్... రజనీకాంత్ పై సత్యరాజ్ ఫైర్

సత్యరాజ్: రంగరాజ్

సత్యరాజ్: రంగరాజ్

Rajinikanth - Satya Raj: రాజకీయం ముసుగులో బిజినెస్... రజనీకాంత్ పై సత్యరాజ్ ఫైర్

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ డిసెంబర్‌31న తన రాజకీయ పార్టీ పేరుని ప్రకటిస్తానని తెలియజేసిన సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా పోటీ పడనుండటం ఖాయమైంది. దీనిపై తమిళ సినీ పరిశ్రమ నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌పై కోలీవుడ్‌ విలక్షణ నటుడు సత్యరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆధ్యాత్మిక రాజకీయాలకు తాను తెర తీస్తానని రజినీకాంత్‌ ప్రకటించిన నేపథ్యంలో ఓ వేదికపై సత్యరాజ్‌ మాట్లాడుతూ..

"ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు. తన జీవితాన్ని త్యాగం చేసి, తను నమ్మిన సిద్ధాతం కోసం బరిలోకి తన భవిష్యత్తు, చేస్తున్న పని గురించి ఆలోచించకూడదు. జైలుకి వెళ్తామా లేదా..అనే చాలా విషయాలు గురించి భయపడకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చేదే రాజకీయం. ప్లాన్‌ వేసి, లెక్కలు వేసుకుని వచ్చేది రాజకీయాలు కాదు. దాన్ని వ్యాపారం అంటారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో హోటల్‌ స్టార్ట్‌ చేయాలంటే వెజిటేరియన్‌ హోటల్‌ పెట్టాలా లేక నాన్‌ వెజిటేరియల్‌ హోటల్‌ పెట్టాలా లేక రెండు కలిపి పెట్టాలా? అని లెక్కలు వేసి ఆలోచిస్తాం. అదే బిజినెస్‌.. రాజకీయం కాదు. ఈ వ్యాపారానికి ఏదో పేరు పెట్టుకోవాలే తప్ప రాజకీయాలని పేరు పెట్టకూడదు. రాజకీయాలంటే వెంటనే బరిలోకి దూకేయాలి. అంతే కానీ వ్యాపారం ప్రారంభించి దానికి ఆధ్యాత్మిక రాజకీయం అని పేరు పెట్టకూడదు. ఉక్కు సంకెళ్ళతో బంధించేది ఆధ్యాత్మిక రాజకీయం కాదు.. ప్రేమతో చేసేది. నేను ప్రశాంతత కోసం నేను హిమాలయాలకు, కొండలకు వెళ్లను. ఎందుకంటే నాకేం కావాలో నాకు తెలుసు. నేను పళ్లు తోముకునే సమయంలో, షేవింగ్‌ చేసుకునే సమయంలో ఇలా ఏ పనిచేసినా ప్రశాంతంగానే చేసుకుంటాను" అని అన్నారు.ఇలా సత్యరాజ్‌ ఎక్కడా రజినీకాంత్‌ పేరు ఉపయోగించలేదు. కానీ.. ఆయన చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయాలు అనే అంశంపై మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో వెంటనే రావాలి కానీ.. వ్యాపారంలోలాగా లెక్కలు వేసుకోకూడదు అంటూ రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ముందు నుండి సత్యరాజ్‌ తన అసంతృప్తిని ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి సత్యరాజ్‌ ఇలా స్పందించారు. ఇప్పటికే కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించిందేమీ లేదు. ఇప్పుడు రజినీకాంత్‌ వచ్చే ఏం చేస్తాడని కొందరు విమర్శలు చేసేవాళ్లు కూడా ఉన్నారు.

First published:

Tags: Rajini Kanth, Sathyaraj, Tamil nadu Politics

ఉత్తమ కథలు