కత్తి మహేష్‌పై మళ్లీ దాడి.. ఐమాక్స్ దగ్గర కలకలం..

Kathi Mahesh: కత్తి మహేష్ మరోసారి కాంట్రవర్సీ కింగ్ అయిపోయాడు. కొన్ని రోజుల కింది వరకు ఈయన కామ్‌గానే ఉన్నా కూడా ఇప్పుడు మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయాడు కత్తి మహేష్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 4:00 PM IST
కత్తి మహేష్‌పై మళ్లీ దాడి.. ఐమాక్స్ దగ్గర కలకలం..
కత్తి మహేష్ (Source: attack on kathi mahesh)
  • Share this:
కత్తి మహేష్ మరోసారి కాంట్రవర్సీ కింగ్ అయిపోయాడు. కొన్ని రోజుల కింది వరకు ఈయన కామ్‌గానే ఉన్నా కూడా ఇప్పుడు మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయాడు కత్తి మహేష్. ఆ మధ్య ఈయన రాముడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందూ సంఘాల్లో కోపాన్ని పెంచేస్తున్నాయి. ఏం తెలుసని నువ్వు మా రాముడి గురించి మాట్లాడుతున్నావ్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోమంటూ ఈయనపై రెచ్చిపోతున్నారు హిందు సంఘ నేతలు. శ్రీ రాముడు మాంసం తింటాడని.. ఆయనకు జింక మాంసం అంటే ఇష్టమని ఈ మధ్యే కామెంట్ చేసాడు కత్తి మహేష్. అప్పట్నుంచి ఈయనపై కోపంతో రగిలిపోతున్నారు హిందుత్వ వాదులు. ఇదిలా ఉంటే తాజాగా ఈయనపై దాడి జరిగింది.
కత్తి మహేష్ (Source: attack on kathi mahesh)
కత్తి మహేష్ (Source: attack on kathi mahesh)

ఐమాక్స్‌కు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు వచ్చిన ఈయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. సినిమాకు వచ్చిన సంగతి తెలుసుకున్న కొందరు వ్యక్తులు బయట కత్తి కోసం కాచుకుని ఉన్నారు. ఆయన ఎక్కిన కారుపై దాడి చేసారు. దాంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈయనకు ఎలాంటి గాయాలు కూడా కాలేదు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్‌కు చేరుకుని కత్తి మహేష్‌ను అక్కడ్నుంచి సేఫ్‌గా పంపించారు. అయితే కత్తి వచ్చిన విషయాన్ని తెలుసుకుని దాడి చేయడంతో అక్కడ కాసేపు వాతావరణం వేడెక్కింది. గతంలో కూడా ఓసారి కత్తిపై ఇలాగే దాడి జరిగింది. అప్పుడు కోడిగుడ్లతో ఈయనపై దాడి చేసారు. ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు