శ్రేయాస్ ఏటిటి, వర్మ మధ్య చిచ్చుపెట్టిన పవర్ స్టార్..

RGV Power Star movie: రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మామూలు బిజీగా లేడు. ఇంకా చెప్పాలంటే మామూలు రోజుల కంటే కూడా లాక్‌డౌన్‌లోనే ఈయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2020, 2:20 PM IST
శ్రేయాస్ ఏటిటి, వర్మ మధ్య చిచ్చుపెట్టిన పవర్ స్టార్..
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
  • Share this:
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మామూలు బిజీగా లేడు. ఇంకా చెప్పాలంటే మామూలు రోజుల కంటే కూడా లాక్‌డౌన్‌లోనే ఈయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు సినిమాను కొత్త పుంతలు తొక్కించే ఈయన ఇప్పుడు ఏకంగా వారం రోజులకో సినిమాను విడుదల చేస్తున్నాడు. అది కూడా అన్నీ ఆన్‌లైన్ రిలీజ్‌లే. ఇప్పటికే క్లైమాక్స్, నేక్డ్ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు కూడా ప్లాన్ చేసాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా థ్రిల్లర్ అనే సినిమాతో పాటు పవర్ స్టార్ అనే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు వర్మ.
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)


ఇందులో థ్రిల్లర్ శ్రేయాస్ ఏటిటిలో విడుదల కానుంది. శ్రేయాస్ శ్రీనివాస్‌తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు వర్మ. అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాలను టికెట్ ప్రైస్ ఫిక్స్ చేసి శ్రేయాస్ ఏటిటిలో విడుదల చేస్తున్నారు. అయితే అందులో పవర్ స్టార్ మాత్రం విడుదల కావడం లేదు. ఇక్కడే వర్మ, శ్రేయాస్ టీం మధ్య మాటల యుద్ధం కూడా జరిగినట్లు తెలుస్తుంది. పైగా లీగల్‌గా కూడా కొన్ని సమస్యలు వచ్చినా పవర్ స్టార్ సినిమాను మాత్రం తన ప్లాట్ ఫామ్‌లో విడుదల చేసేది లేదని శ్రేయాస్ శ్రీనివాస్ తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)

పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా కుటుంబానికి శ్రీనివాస్ అభిమాని.. ఇప్పుడు వర్మ చేస్తున్న ఈ సెటైరికల్ మూవీని తన ప్లాట్ ఫామ్‌లో విడుదల చేస్తే అనవసరంగా నెగిటివిటీ కూడా వచ్చేస్తుందని శ్రీనివాస్‌కు తెలియంది కాదు. అందుకే అగ్రిమెంట్ క్రాస్ చేస్తే భారీగానే ఆర్థిక నష్టాలు వస్తాయని తెలిసినా కూడా పవర్ స్టార్‌ను మాత్రం తన శ్రేయాస్ ఏటిటిలో విడుదల చేసేది లేదంటున్నారు ఈ టీం. దాంతో వర్మ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయాడు.
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)

తన సినిమాలను వరసగా శ్రేయాస్‌లోనే విడుదల చేస్తున్న వర్మ.. ఇప్పుడు పవర్ స్టార్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నాడు. ఈ విషయంలో లీగల్ ఫైట్‌కు సిద్ధం అవుతున్నా.. కావాలంటే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పవర్ స్టార్ నుంచి శ్రేయాస్‌ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు భారీగానే జరుగుతున్నాయి. మొత్తానికి శ్రేయాస్, వర్మ మధ్య పవర్ స్టార్ భారీగానే చిచ్చు పెట్టేసాడు ఇప్పుడు. మరి ఇది ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: July 11, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading