ATM Web Series: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar), స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ (Ustad Bhagath Singh) డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన కథతో తెరకెక్కింది ఏటీఎం వెబ్‌సీరీస్ (ATM Web Series). బిగ్‌బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5 ) టైటిల్ విన్నర్ వీజే సన్నీ(VJ Sunny) కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. ఏటీఎం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ శని వారం విడుదల చేశారు. సి. చంద్రమోహన్ (C.Chandra Mohan) దర్శకత్వం వహిస్తున్న వెబ్‌సీరీస్ ఇది. డీజే, గబ్బర్‌సింగ్ చిత్రాల ఫేమ్ హరీష్‌శంకర్ స్టార్ షో రన్నర్. జీ5 ఈ వెబ్‌సీరీస్‌ని తీసుకుంది. దోపిడీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. జనవరి 20 నుంచి జీ5లో (Zee5)లో స్ట్రీమింగ్ కానుంది.
గద్దలకొండ గణేష్ ఫేమ్ డైరక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ``దోపిడీ జోనర్‌లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సిరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. పిల్లీ ఎలుకాలా మిక్కీ మౌస్ గేమ్‌లాగా ఉంటుంది. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశామన్నారు.
Gear maarchandi!! #PaisalThoAata lo mimmalni kuda parigettistaru!!! Before the game starts, here's the teaser of #ATMOnZee5 Stealing the show from January 20@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c pic.twitter.com/hIU4Hdoqo9
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 7, 2023
పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారని నిర్మాత హర్షిత్ రెడ్డి చెప్పారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారారు. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు.
ఇక దిల్ రాజు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాణంలో విజయ్ హీరోగా ‘వారసుడు’ సినిమా ప్యాన్ ఇండియా సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అటు హరీస్ శంకర్.. పవన్ కళ్యాణ్‌తో చేయబోయే ‘భవదీయుడు భగత్‌సింగ్’ ఇపుడు ‘ఉస్తాద్’ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Dil raju, Harish Shankar, Tollywood, Zee5