టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్ఎన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం '@లవ్' (@Love). ఈ సినిమాను డిసెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మహేందర్ సింగ్ (Mahender Singh), శైలజ తాటిచెర్ల (Shilaja Thaticharla) మరియు శ్రీ నారాయణ (Sri Narayana) ఈ చిత్రాన్ని నిర్మించారు. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రాన్ని చూసిన సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని ఏమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు శ్రీ నారాయణ మాట్లాడుతూ.. వైవిధ్యంగా ఉండి, సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు ఎప్పుడూ విజయాలు సాధిస్తాయి. ఇప్పుడు '@లవ్' అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉంది. మరో వినూత్న సినిమాగా నిలుస్తుంది. మంచి సినిమా రావడం లేదు అని బాధ పడే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది.
అందుకే, ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు జర్నీఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. @లవ్ చిత్రంలో ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. ప్రతి ఎమోషన్ కథను నడిపిస్తుంది. ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుంది అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor