బిగ్‌బీ ఇంట్లో అగ్నిప్రమాదం... ఐశ్వర్యరాయ్ మేనేజర్‌ను కాపాడిన షారుఖ్

అయితే పార్టీలో బిజీ బిజీగా తిరుగుతున్న ఐశ్వర్యరాయ్ మేనేజర్ అర్చన లెహెంగాకు అక్కడ ఏర్పాటు చేసిన దీపాలకు తగిలి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె గట్టిగా అరుపులు వేసింది.

news18-telugu
Updated: October 30, 2019, 5:04 PM IST
బిగ్‌బీ ఇంట్లో అగ్నిప్రమాదం... ఐశ్వర్యరాయ్ మేనేజర్‌ను కాపాడిన షారుఖ్
షారుఖ్, ఐశ్వర్యరాయ్
  • Share this:
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. దీపవాళి వేడుకల సందర్భంగా బాలీవుడ్ బిగ్ బీ ఇంట్లో జరిగిన పార్టీకి సెలబ్రిటీలంతా హాజరయ్యారు. ఈ పార్టీకి షారుఖ్‌ కూడా ఎటెండ్ అయ్యాడు. అయితే పార్టీలో బిజీ బిజీగా తిరుగుతున్న ఐశ్వర్యరాయ్ మేనేజర్ అర్చన లెహెంగాకు అక్కడ ఏర్పాటు చేసిన దీపాలకు తగిలి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె గట్టిగా అరుపులు వేసింది. దీంతో అక్కడున్న షారుఖ్ వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. మంటలు వ్యాపించకుండా రక్షించాడు. వెంటనే తన జాకెట్‌తో ఆమె  లెహెంగాకు అంటుకున్న మంటల్ని షారుఖ్ ఆపేశాడు.

అయితే ప్రమాదంలో అర్చనకు చేతులకు, కాళ్లు 15శాతం గాయాలయ్యాయి. షారుఖ్ కూడా స్వల్ఫ గాయాలయ్యాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్లు దారి చేరకుండా ఉండేందుకు ఆమెను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బిగ్‌ బీ ఇంట్లో అతికొద్ది గెస్ట్‌లు మాత్రమే ఉన్నారు. పార్టీ సుమారుగా ముగియడంతో మేనేజర్‌ అర్చన తన కుమార్తెతో కలిసి బయట ప్రాంగణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.


First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>