హోమ్ /వార్తలు /సినిమా /

Suriya : ఓటీటీలో ఆకాశం నీ హ‌ద్దురా.. సూర్యకు మ‌ద్ద‌తుగా నిర్మాత అశ్వినీద‌త్‌..

Suriya : ఓటీటీలో ఆకాశం నీ హ‌ద్దురా.. సూర్యకు మ‌ద్ద‌తుగా నిర్మాత అశ్వినీద‌త్‌..

సూర్య, అశ్వనీ దత్ Photo : Twitter

సూర్య, అశ్వనీ దత్ Photo : Twitter

Suriya : ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంగా ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హ‌ద్దురా... సూర్య న‌టిస్తూ, నిర్మించాడు

  ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్‌. గోపీనాథ్ జీవితంగా ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆకాశం నీ హ‌ద్దురా... సూర్య న‌టిస్తూ, నిర్మించాడు. త‌మిళంలో 'సూరారై పొట్రు'గా తెరకెక్కింది. కరోనా కారణంగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాల‌ని నిర్ణ‌యించింది చిత్రబృందం. ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరుచుకొనే అవ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల్లే స‌హ నిర్మాత గునీత్ మోంగాతో క‌లిసి సూర్య ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే సూర్య‌తో 'సింగం' మూవీ సిరీస్‌ను రూపొందించిన డైరెక్ట‌ర్ హ‌రి ఆ నిర్ణ‌యంపై పున‌రాలోచించుకోవాల‌ని తాజాగా సూర్య‌కు లేఖ రాయ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సూర్య తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌ముఖ చ‌ల‌న‌చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ స‌మ‌ర్ధించాడు. ఆరు నెల‌లుగా మ‌హ‌మ్మారి వ్యాప్తి కార‌ణంగా జ‌న జీవ‌నం స్తంభించిపోయి ఉందనీ, అందుకు అనుగుణంగా థియేట‌ర్లను కూడా మూసివేశారనీ, ఇప్పుడు అవి తెరుచుకున్నా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించి క‌రోనాకు బ‌లి చేయ‌డం స‌రైన ప‌ని కాదనీ ఆయ‌న తన లేఖలో అభిప్రాయ‌ప‌డ్డాడు.

  జ‌న‌వ‌రి నెల వ‌ర‌కు థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశాలు లేవు. ఆ త‌ర్వాత కూడా ఎలా ఉంటుంద‌నేది అర్థం కాని ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో సినిమాల‌ను థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తాం అని.. అంద‌రూ థియేట‌ర్ల‌లోనే చూడండి అని ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో, వారి ప్రాణాల‌తో ఆట‌లాడటం చాలా త‌ప్పు. అందుక‌ని ఓటీటీలో నేరుగా 'ఆకాశం నీ హ‌ద్దురా' (సూరారై పొట్రు) చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని సంక‌ల్పించిన సూర్య‌, 'వి' చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించిన నాని ల‌ను నేను అభినందిస్తున్నాను అని పేర్కోన్నాడు. ఇంట్లో క్షేమంగా ఉంటూ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునేవాళ్లంద‌రికీ సూర్య‌, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. అలాగే, డైరెక్ట‌ర్ హ‌రి సినిమాల‌కు నేను అభిమానిని. ప్రేక్ష‌కుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా ఆయ‌న‌ను కోరుతున్నానని తన లేఖలో తెలిపాడు దత్.

  ఇక ఓటీటీలో విడుదల చేయాలని హీరో సూర్య తీసుకున్న నిర్ణయంపై తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే సూర్య తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ తమిళ దర్శకనిర్మాత భారతీరాజా మద్దతుగా నిలిచాడు. సూర్య గురించి కామెంట్ చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించాడు. ఈ నిరసనల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని... సూర్య కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని సూర్య తీసుకున్న నిర్ణయంపై ఆరోపించాడు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Aswani Dutt, Suriya

  ఉత్తమ కథలు