news18-telugu
Updated: November 10, 2019, 11:41 AM IST
Instagram
‘అసురన్’.. తమిళ్లో ధనుష్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అసురన్ను తమిళ్లో వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. దళిత కథ, నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు ప్రముఖ హీరో వెంకటేష్. తమిళ్లో ఈ సినిమా హత్తుకునే భావోద్వేగాలతో.. రా అండ్ రస్టిక్గా ఉంటూ అదరగొట్టింది. దీంతో అదే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించగల దర్శకుడి కోసం వెతుకుతున్న నిర్మాత సురేష్ బాబు చివరికి హను రాఘవపూడిని ఫైనల్ చేశాడని టాక్. హను ఇంతకు ముందు, అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. దీంతో హను ఈ సినిమాకు న్యాయం చేస్తాడని.. సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయగలరని సురేష్ బాబు, వెంకీ భావిస్తున్నారట. అంతా ఓకే అయితే ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని సమాచారం.
యాంకర్ మంజూష అదిరే అందాలు...
Published by:
Suresh Rachamalla
First published:
November 10, 2019, 11:38 AM IST