అసురన్ తెలుగు రీమేక్ డైరెక్టర్‌ మారిపోయాడుగా..

‘అసురన్’.. దళిత నేపథ్యంలో తమిళ్‌లో వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు.

news18-telugu
Updated: November 18, 2019, 8:17 AM IST
అసురన్ తెలుగు రీమేక్ డైరెక్టర్‌ మారిపోయాడుగా..
Instagram/dhanushkraja
  • Share this:
‘అసురన్’.. దళిత నేపథ్యంలో తమిళ్‌లో వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. మరో పాత్రలో మళయాల నటి మంజు వారియర్ నటించింది. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు ప్రముఖ హీరో వెంకటేష్.  తమిళ్‌లో ఈ సినిమా హత్తుకునే భావోద్వేగాలతో..  గ్రామీణ నేపథ్యంలో సాగుతూ..హృదయాలను దోచుకుంది. ఆ విధంగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. దీంతో అదే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించగల దర్శకుడి కోసం వెతుకుతున్న నిర్మాత సురేష్ బాబు మొదట హను రాఘవపూడిని ఫైనల్ చేశాడని వార్తలు వినపడ్డాయి. హను ఇంతకు ముందు, అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు.



 





View this post on Instagram




 

How time flies! 26 years since Sathruvu. #throwbackthursday


A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on





అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు హను రాఘవపూడి కాదని ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారని సమాచారం. అయితే శ్రీకాంత్ అడ్డాల గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం’ లాంటి క్లాస్, ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు చేసిన సాఫ్ట్ డైరెక్టర్. ఆయన మినిమమ్ యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లింది కూడా లేదు. అలాంటి డైరెక్టర్ రివెంజ్ డ్రామా, హెవీ యాక్షన్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ ఉండే ‘అసురన్’ను ఏలా హ్యాండిల్ చేస్తారోనని తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.



 




View this post on Instagram




 

#Asuran Trailer Out Now. Link in Bio :)


A post shared by Dhanush (@dhanushkraja) on





నైనా గంగూలీ హాట్ ఫోటోస్..
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు