హోమ్ /వార్తలు /సినిమా /

'అసురుడు' గా రాబోతున్న ధనుష్

'అసురుడు' గా రాబోతున్న ధనుష్

Dhanush /Twitter

Dhanush /Twitter

'మారి2' విజయ ఉత్సాహం మీద ఉన్న దనుష్ మరో సినిమాకు సై అన్నాడు. ఈ తాజా సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో ఉండబోతోంది.

  ధనుష్ హీరోగా లేటెస్ట్‌గా 'మారి2' విడుదలైంది తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతుంది. 'మారి2' విజయ ఉత్సాహం మీద ఉన్న దనుష్ మరో సినిమాకు సై అన్నాడు. ఈ తాజా సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో ఉండబోతోంది.

  వెట్రి మారన్ డైరెక్షన్‌‌లో ధనుష్ ఇంతకు ముందు 'పొల్లాదవన్', 'ఆడుకళమ్', 'వడ చెన్నై' చేసిన సినిమాలు ప్రక్షకులను అలరించాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రాబోతుంది. సినిమాకు 'అసురన్' అనే పేరును పరిశీలిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను వి. క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. థాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని స్వయంగా హీరో ధనుష్ తన ట్విటర్ ద్వారా తెలిపారు.  దానికి సంబంధించిన ట్విట్‌ను కింద చూడోచ్చు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tamil Cinema, Tamil Film News

  ఉత్తమ కథలు