హోమ్ /వార్తలు /సినిమా /

Samantha-Chaitanya: సమంత-నాగచైతన్య విడాకుల గురించి ఐదేళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్

Samantha-Chaitanya: సమంత-నాగచైతన్య విడాకుల గురించి ఐదేళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు.. వీడియో వైరల్

చైతన్య, సమంత(ఫైల్ ఫొటో)

చైతన్య, సమంత(ఫైల్ ఫొటో)

Samantha-Naga chaitanya: సమంత, నాగ చైతన్య విడాకుల వేళ సోషల్ మీడియాలో ఓ పాత వీడియో వైరల్‌గా మారింది. వీరిద్దరి పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడదని వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఐదేళ్ల క్రితమే చెప్పారు.

  ఇప్పుడు టాలీవుడ్‌ (Tollywood)తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే.. అది సమంత (Samantha), నాగ చైతన్య (Naga Chaitanya) విడాకుల వ్యవహారమే. మొన్నటి వరకు అక్కినేని దంపతులపై ఎన్నో పుకార్లు వచ్చాయి.  వీరిద్దరూ విడిపోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ సమంత గానీ, నాగ చైతన్య గానీ స్పందించలేదు. సోషల్ మీడియాలో పుకార్లు సాధారణమే అని.. వారిద్దరు బాగానే ఉండి ఉంటారని అభిమానులు అనుకున్నారు. కానీ ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ అక్టోబరు 2న చై, సామ్ సంచలన ప్రకటన చేశారు. ఔను.. మేమిద్దరం విడిపోతున్నామని విడివిడిగా ప్రకటించారు.  ఆ ప్రకటనతో సినీ ఇండస్ట్రీతో పాటు అక్కినేని అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. చిలుకా గోరికంల్లా ఉంటే ఈ జంట విడిపోవడమేంటని ఆశ్చర్యపోయారు. ఐతే వీరిద్దరి విడాకుల వేళ సోషల్ మీడియాలో ఓ పాత వీడియో వైరల్‌గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడదని వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఐదేళ్ల క్రితమే చెప్పారు.

  Samantha Marriage Saree Special: పెళ్లిలో సమంత ధరించిన చీర ఎవరిదంటే..?

  2016లో సెప్టెంబరులో ఇండస్ట్రీ మొత్తం నాగచైతన్య, సమంత గురించే చర్చ జరిగింది. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌‌గా మారింది. అప్పుడే వీరిద్దరి బంధంపై వేణుస్వామి స్పందించారు. సమంత, నాగ చైతన్య జాతకాల్లో దోషాలు ఉన్నాయని.. ఎక్కువ కాలం కలిసి ఉండలేరని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ''నాగ చైతన్య జాతకంలో శని, రవి కాంబినేషన్  ఉంది. కాల సర్పదోషముంది. సమంతది భరణి నక్షత్రం. అమావాస్య  రోజు పుట్టింది. అమ్మాయి జాతకంలోనూ  కుజ దోషం, కాల సర్ప దోషం ఉంది. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. అంటే భర్తకు దూరంగా ఉండాల్సిన పరిస్థిత వస్తుంది. అంతేకాదు గురు నీచంలో ఉన్నారు. దీని ద్వారా సినిమాలు తగ్గిపోతాయి. క్రేజ్ పడిపోతుంది. వీరిద్దరి కాంబినేషన్ వర్కవుట్ కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం నూటికి నూరు శాతం ఉంది.'' అని వేణుస్వామి అన్నారు.

  Samantha: అన్ని వందల కోట్లు భరణంగా ఇస్తానంటే వద్దన్న సమంత..?

  కాగా, అక్టోబరు 2న భార్య భర్తలుగా సమంత, నాగ చైతన్యలు విడిపోయారు. ఈ విషయాన్ని సమంత, నాగ చైతన్య తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మీము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానలు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాాలి అంటూ ఇరువురూ విడివిడిగా పోస్ట్ చేశారు. ఐతే వారిద్దరు విడిపోవడానికి కారణమేంటన్నది తెలియరాలేదు. దాని గురించే  సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Naga Chaitanya Akkineni, Naga Chaitanya Samantha Divorce, Samantha akkineni, Tollywood

  ఉత్తమ కథలు