హోమ్ /వార్తలు /సినిమా /

Samantha - Naga chaitanya: వీళ్ళు విడిపోతారని మూడేళ్ల ముందే చెప్పా.. సామ్, చైతు విడాకులపై వేణు స్వామి షాకింగ్ వీడియో?

Samantha - Naga chaitanya: వీళ్ళు విడిపోతారని మూడేళ్ల ముందే చెప్పా.. సామ్, చైతు విడాకులపై వేణు స్వామి షాకింగ్ వీడియో?

Samantha - Naga chaitanya

Samantha - Naga chaitanya

Samantha - Naga chaitanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సమంత తన పేరులో అక్కినేని తొలగించింది అని అంతేకాకుండా నాగచైతన్యను దూరం పెట్టిందని బాగా పుకార్లు వినిపించాయి.

ఇంకా చదవండి ...

  Samantha - Naga chaitanya: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుండి అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సమంత తన పేరులో అక్కినేని తొలగించింది అని అంతేకాకుండా నాగచైతన్యను దూరం పెట్టిందని బాగా పుకార్లు వినిపించాయి. ఇక ఇటీవలే సమంత తీర్థయాత్రలకు ఒంటరిగా ప్రయాణం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక తనతోపాటు నాగచైతన్య లేకపోయేసరికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటున్నారని అనుకున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి విడాకుల గురించి ఓ స్వామి ముందుగానే చెప్పాడట.

  వీరి విడాకుల గురించి ఇండస్ట్రీలో ఇంత హాట్ టాపిక్ గా మారిన కూడా అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి స్పందించలేదు. ఇదిలా ఉంటే సినిమా రంగానికి, పొలిటికల్ కు చెందిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. తాజాగా వీరి విడాకుల గురించి తెలిపాడు. తను మూడేళ్ల క్రితమే వీళ్ళ జాతకం చెప్పాను అంటూ.. వాళ్ళ ఇద్దరి జాతకం తన దగ్గర ఉందని తెలిపాడు. మూడేళ్ల క్రితమే ఈ జంట గురించి నాగరాజు ఇంటర్వ్యూలో చెప్పాను అంటూ నేను చెప్పినట్లుగానే ప్రస్తుతం వీరి మధ్య బంధం సీరియస్ గా ఉందని తెలిపాడు.

  ఇది కూడా చదవండి:ఆ ఒక్క మాటతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీ డౌట్స్ అన్ని క్లియర్!

  ఇక నిజంగానే ఈ జంట విడిపోతుందా అని అడగడంతో గతంలో వారి గురించి చెప్పిన వీడియోను చూడండి అంటూ తెలిపాడు ఆ స్వామి. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే.. నాలుగేళ్ల క్రితం వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడాడు. తనకు అక్కినేని కుటుంబం అంటే కోపం లేదని.. గతంలో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ విషయంలో క్యాన్సిల్ అవుతుందని చెప్పడంతో నాగార్జున తన మీద కేసు వేస్తారని అన్నారని తెలిసింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకే అది బ్రేకప్ జరిగిందని తెలిపాడు. జాతకాలను పరిశీలించి మరి చెబుతాను అంటూ.. అందుకే అఖిల్ గురించి చెప్పానని కాబట్టి అలాగే జరిగింది కూడా అని తెలిపాడు.

  ఇది కూడా చదవండి:'సైమా' అవార్డ్స్ 2019 విజేతలు.. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ నటిగా ఎవరంటే?


  ఇక సమంతకు, నాగచైతన్యకు పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పానని.. అందులో వాళ్ళకి మధ్య విభేదాలు రావొచ్చని, సంతానం కలగకపోవచ్చని అంతేకాకుండా విడిపోవచ్చని అన్నాడట. సమంత అమావాస్యరోజు పుట్టిందని అందుకు తన భర్త నాగచైతన్యకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా ముందే చెప్పాను అని తెలిపాడు. సినిమా పరంగా ఇబ్బందులు ఉండవని పెళ్లి తర్వాత కూడా సినిమా జీవితాన్ని కొనసాగిస్తారని.. పెళ్లికి ముందే వీరి జీవితం ఎలా ఉండబోతుందో చెప్పాను అని ప్రస్తుతం పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో చూశారు కదా అంటూ అతడు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిని బట్టి ఈ స్వామి చెప్పినట్లు నిజంగానే విడిపోతారో లేదో చూడాలి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Naga Chaitanya, Samantha akkineni, Tollywood, Venu swamy

  ఉత్తమ కథలు