లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara). నయనతార 1984 నవంబరు 18 బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నయనతార పలు సినిమాల్లో నటించింది. తమిళంలో 2004లో రజనీకాంత్(Rajnikanth) సరసన చంద్రముఖి సినిమా చేసింది. ఈ సినిమాతో నయనతారకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత నయన్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అగ్రహీరోలందరితో కలిసి సినిమాల్లో ఆడిపాడింది.
తాజాగా నయనతార పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. కోలివుడ్ డైరెక్టక్ విఘ్నేశ్ శివన్‌తో నయనతార గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి షికార్లు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తుంటాయి. అయితే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. 5ఏళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. లాక్డౌన్లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తిరుమల స్వామి వారిని దర్శించుకున్న విఘ్నేశ్ నయన్.. పెళ్లి వేదిక గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి నయనతార పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నయనతార జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. వేణు స్వామి చెప్పిన ఈ జోష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే సమంత నాగచైతన్య (Samantha Naga Chaitanya)విషయంలో వేణు స్వామి చెప్పింది జరిగింది. గతంలో సమంత-నాగచైతన్య పెళ్లి సమయంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సమంతకు వైవాహిక జీవితం కలిసి రాదని, ఆమె పెళ్లి చేసుకున్న అతి త్వరలోనే భర్తతో విడిపోతుందని జోష్యం చెప్పారు. ఇక చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం వేణు స్వామి చెప్పినట్లుగానే ఆమె జీవితంలో జరిగిందని అందరు చర్చించుకున్నారు.
అయితే వేణు స్వామి నయనతారతో పాటు.. మరికొందరు సెలబ్రిటీ హీరోయిన్ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్ 2024 తర్వాత అంతమైపోతుందని వేణు స్వామి పేర్కొన్నారు. దీంతో ఇప్పడు ఈయన చెప్పిన జ్యోతిష్యంపై టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nayanatara, Nayanatara vignesh, Nayanathara, Samantha akkineni