ప్రభాస్‌కు అస్సాం పోలీసులు షాక్.. కరోనా నిబంధనలకు విరుద్ధంగా..

Prabhas Radhe Shyam poster: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఫాలోయింగ్ వచ్చేసింది. ఎక్కడో అస్సాంలో కూడా ఇప్పుడు ప్రభాస్‌ను గుర్తు పడుతున్నారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 10, 2020, 5:20 PM IST
ప్రభాస్‌కు అస్సాం పోలీసులు షాక్.. కరోనా నిబంధనలకు విరుద్ధంగా..
ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్ (Prabhas Radhe Shyam movie)
  • Share this:
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఫాలోయింగ్ వచ్చేసింది. ఎక్కడో అస్సాంలో కూడా ఇప్పుడు ప్రభాస్‌ను గుర్తు పడుతున్నారు అభిమానులు. అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈయనకు మంచి ఇమేజ్ వచ్చిందిప్పుడు. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత సాహోతో అలాంటి ప్రయత్నమే చేసి సక్సెస్ అయ్యాడు కూడా. ఈ చిత్రం హిందీలో కూడా 150 కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ (Twitter/Prabhas)
ప్రభాస్ (Twitter/Prabhas)


ఇప్పుడు ఈయన నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమాకు రాధే శ్యామ్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు. జులై 10న విడుదల చేసిన ఫస్ట్ లుక్ సంచలనం రేపుతుంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా. ఇదిలా ఉంటే ఫస్ట్ లుక్‌లో ప్రభాస్, పూజా రొమాంటిక్ పోజ్ ఇచ్చారు. కానీ కరోనా వైరస్ సమయంలో వాళ్లిద్దరూ చాలా దగ్గరగా ఉన్నా కూడా ఎలాంటి మాస్క్ ధరించలేదు. దాంతో రాధే శ్యామ్ సినిమాను తమ కోవిడ్ 19 ప్రచారం కోసం వాడుకున్నారు అస్సాం పోలీసులు.

అస్సాంలోని నాగాన్ పోలీసులు ప్రభాస్‌కి ఈ విషయం తెలిపే ప్రయత్నం చేశారు. కానీ కుదరకపోవడంతో సోషల్ మీడియాలో ఫోటోషాప్ ఆప్షన్ వాడుకున్నారు. ఎప్పుడైనా కూడా మీకు యిష్టమైన వాళ్లు బయటికి వెళ్తినపుడు కచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలని చెప్పండి.. మేం ప్రభాస్‌కు చెప్పడానికి ప్రయత్నించినా విఫలమయ్యాం అందుకే ఫోటోషాప్‌లో చెప్తున్నామంటూ నాగాన్ పోలీసులు ట్వీట్ చేసారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలనే సందేశాన్ని రాధే శ్యామ్ పోస్టర్‌తో.. ప్రభాస్ ఇమేజ్‌తో అందరికీ చేరువయ్యేలా వాడుకున్నారు అస్సాం పోలీసులు.

ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్‌పై అస్సాం పోలీస్ ప్రచారం (Prabhas Radhe Shyam movie)
ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్‌పై అస్సాం పోలీస్ ప్రచారం (Prabhas Radhe Shyam movie)

దీనిపై పూజా, ప్రభాస్ ఎలాంటి స్పందిస్తారో చూడాలిక. గోపీచంద్ జిల్ సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకుని రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఇందులో ప్రభాస్ ఆస్ట్రాలజర్‌ (జాతకాలు చెప్పే వ్యక్తి)గా నటిస్తున్నాడని తెలుస్తుంది. 60వ దశాబ్ధపు ప్రేమకథగా ఇది రూపొందుతుంది. గీతా కృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మిస్తున్నాయి. 2021లో సినిమా విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 10, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading