హోమ్ /వార్తలు /సినిమా /

Assam CM - Pathaan: ఇంతకీ షారుఖ్ ఖాన్ ఎవరు ? మీడియాను ప్రశ్నించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ..

Assam CM - Pathaan: ఇంతకీ షారుఖ్ ఖాన్ ఎవరు ? మీడియాను ప్రశ్నించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ..

షారుఖ్ పై అస్సాం సీఎం వక్యాఖ్యలు (File/Photo)

షారుఖ్ పై అస్సాం సీఎం వక్యాఖ్యలు (File/Photo)

Assam CM - Pathaan - Shah Rukh Khan : బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఎవరంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Assam CM - Pathaan - Shah Rukh Khan : బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఎవరంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీలో విడుదలైన ‘బేషరమ్’ రంగ్ పాటపై పెద్ద దుమారమే నడుస్తోంది. హిందువులు పవిత్రంగా భావించే కాషాయం రంగు కలర్‌ బికినీలో హీరోయిన్ దీపికాను చూపిస్తూ.. ఈ రంగును బేషరమ్ రంగ్ అంటూ చేసిన పాటపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఈ సినిమా పోస్టర్స్‌ను చించుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పఠాన్ మూవీపై అసోంలో ప్రదర్శించే నారేంగి థియేటర్‌లో కొంత మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఈ టాకీస్‌లో విడుదల చేయడానికి వీల్లేదంటూ నినందించారు. మరోవైపు షారుఖ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదల చేయాలాల్సిందే నంటూ డిమాండ్ చేస్తున్నారు. ధీంతో ఇరువర్గాల మధ్య ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సంఘటనపై మీడియా ప్రతినిధులు ఓ సమావేశంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ఇంతకీ షారుఖ్ ఖాన్ ఎవరు ? అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. షారుఖ్ ఖాన్ గురించి కానీ.. ఆయన సినిమా గురించి కానీ తనకెలాంటి సమాచారం తెలియదన్నారు. ఈ విషయమై కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు తనుకు ఫోన్ చేసారన్నారు. కానీ షారుఖ్ మాత్రం మాత్రం చేయలేదన్నారు. ఆయన ఫోన్ చేసి విషయం చెబితే.. పరిశీలిస్తామన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని మీడియా ప్రతినిధులు చెప్పగా..  సీఎం మాట్లాడుతూ అస్సాం ప్రజలు అస్సామీల గురించి మాత్రమే ఆంధోళన చెందాలన్నారు. హిందీ సినిమాల గురించి కాదన్నారు. ఈ సందర్భంగా అస్సాం మాట్లాడుతూ.. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2 త్వరలో విడుదల కానుంది. ఇక్కడ ప్రజలు ఆ సినిమా చూడాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకొనే వారిపై తప్పక చర్యలుంటాయన్నారు.

ఇక ఈ సినిమాలో వివాదాస్పదమైన బేషరమ్ రంగ్ పాటపై సెన్సార్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందులో దీపికా పదుకొణే గ్లామర్ ఒలకబోతపై సెన్సార్ వాళ్లు మూడు కట్స్ చెప్పింది. అంతేకాదు ఈ సినిమాలో పలు సన్నివేశాలను మార్పులు చేసినట్టు చెప్పారు. మొత్తంగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు 10కి పైగా కట్స్ చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో డైలాగులపై కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. దీంతో పలు సన్నివేశాల్లో డైలాగులను మార్చినట్టు సమాచారం. ఈ  సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రూ. 10 కోట్ల వరకు రావొచ్చని ఈ సినిమా బుకింగ్స్ చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్‌’ సాంగ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్‌ బోర్డు ఈ పాటకు మూడు కట్స్‌ చెప్పింది. దీపిక గోల్డెన్‌ స్విమ్‌సూట్‌లో ఉన్న మూడు క్లోజప్‌ షాట్స్‌, కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌లో మార్పులు చేశారు. ఇక సినిమా మొత్తం మీద 10కు పైగా కట్స్‌ చెప్పారట. సంభాషణలకు సంబంధించిన సూచనలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రదర్శన సమయానికి సెన్సార్‌బోర్డు సూచనల మేరకు మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఇక రష్యాలోని సైబీరియాలో షూటింగ్ జరుపుకున్న తొలి బాలీవుడ్ చిత్రంగా ‘పఠాన్’ మూవీ రికార్డులకు ఎక్కింది. ఇక్కడ పలు జేమ్స్ బాండ్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను జోరుగా ప్రచారం చేస్తోంది.

First published:

Tags: Assam, Himanta Biswa Sarma, Pathaan Movie, Shah Rukh Khan