హోమ్ /వార్తలు /సినిమా /

రివ్యూ: అశ్వథ్థామ.. హాఫ్ బాయిల్డ్ అశ్వథ్థాముడు..

రివ్యూ: అశ్వథ్థామ.. హాఫ్ బాయిల్డ్ అశ్వథ్థాముడు..

అశ్వథ్థామ రివ్యూ Ashwathama movie review

అశ్వథ్థామ రివ్యూ Ashwathama movie review

Ashwathama movie review: ఛలో సినిమా తర్వాత నర్తనశాల అంటూ సొంత బ్యానర్‌లో సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు నాగశౌర్య. కానీ మళ్లీ ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని అశ్వథ్థామ అంటూ ఇప్పుడొచ్చాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శౌర్య.. తొలిసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ఆకట్టుకుందా లేదా..?

ఇంకా చదవండి ...

నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్, జిస్సు గుప్తా, సత్య తదితరులు

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రన్

కథ: నాగశౌర్య

కథనం, దర్శకుడు: రమణ తేజ

నిర్మాత: ఉషా మల్పూరీ

ఛలో సినిమా తర్వాత నర్తనశాల అంటూ సొంత బ్యానర్‌లో సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు నాగశౌర్య. కానీ మళ్లీ ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని అశ్వథ్థామ అంటూ ఇప్పుడొచ్చాడు. ఈ చిత్రంపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది. పైగా ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శౌర్య.. తొలిసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ఆకట్టుకుందా లేదా..?

కథ:

వైజాగ్‌లో ఎలాంటి చింత లేకుండా ఉండే కుటుంబంతో ఉంటాడు గణ (నాగ శౌర్య). అప్పుడే అమెరికా నుంచి చెల్లి ఎంగేజ్మెంట్ కోసం వస్తాడు. అయితే పెళ్లికి ముందే తన చెల్లి గర్భవతి అని తెలిసి షాక్ అవుతాడు. కానీ దానికి కారణం ఎవరో తెలియదు అని తెలిసి మరింత షాక్ అవుతాడు. ఆ క్రమంలోనే కేవలం తన చెల్లి మాత్రమే కాదు.. నగరంలో ఇంకా చాలా మంది అమ్మాయిలు అలా పెళ్లికి ముందే గర్భవతులుగా మారుతున్నారని.. ఎవరో ఒక్కడే ఇదంతా చేస్తున్నాడని కనుక్కుంటాడు. పోలీసులకు తెలియకుండా ఈ మిషన్ అంతా పూర్తి చేస్తాడు. ఇలా సాగుతున్న సమయంలోనే అసలు దీనంతటికి కారణమైన ఆ సైకో ఎవడు అనేది చివరికి తెలుసుకుంటాడు. అతడి వరకు హీరో ఎలా వెళ్ళాడు.. మధ్యలో ప్రేయసి నేహా (మెహ్రీన్) సాయం ఎలా తీసుకున్నాడు అనేది కథ..

కథనం:

తెలియకుండా అమ్మాయిలను ఎత్తుకెళ్లడం.. ఆ తర్వాత కోరిక తీర్చుకుని వదిలేయడం.. నేరం బయటపడిపోతుందేమో అనే భయంతో చంపేయడం.. ఇవే సైకోలు చేసే పనులు. ఇలాంటి కథలతో చాలా సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి. ఇప్పుడు అశ్వథ్థామ కథను కూడా ఇలాంటి కోణంలోనే రాసుకున్నాడు నాగశౌర్య. అయితే దీనికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అందులో భాగంగానే తొలి అరగంట సినిమాను పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లోనే నడిపించాడు దర్శకుడు రమణ తేజ. కానీ ఈ సమయంలో సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది.. అనవసరంగా పాటలు.. మధ్యలో హీరోయిన్‌‌తో ఇరికించే లవ్ సీన్స్.. మరో పాట ఇవన్నీ చాలా మొదట్లోనే సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా చేస్తాయి. హీరో చెల్లి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కానీ అసలు కథ మొదలు కాదు. అక్కడ్నుంచి కథలో కదలిక వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు అలా అలా సాగుతుంది కథ. ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటి వరకు అమ్మాయిలను ఎవరు తీసుకెళ్తున్నారు అనేది ఒక్క సీన్‌తోనే ముడి విప్పేసాడు దర్శకుడు. ఇంటర్వెల్‌లోనే విలన్ ఎవరో చూపించి.. అక్కడి నుంచి కథ నడిపించాడు. కానీ ఇలాంటి కథలో సస్పెన్స్ కీలకం. అది మెయింటేన్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా విలన్ ఎవరో తెలిసిన తర్వాత చెప్పడానికి దర్శకుడికి ఇంకేం లేదు.. హీరో అతన్ని ఎలా పట్టుకుంటాడనే ఆసక్తి తప్ప. ఈ సీక్వెన్స్ ఇంకాస్త బాగా రాసుకోవాల్సి ఉండేది. కానీ చాలా సింపుల్‌‌గా తేల్చేసాడు. అయితే సెకండాఫ్ చాలా బెటర్‌గా తెరకెక్కించాడు. ముఖ్యంగా విలన్ జిస్సు గుప్తాపై వచ్చే సీన్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. అతడి సైకోయిజాన్ని బాగానే ఎలివేట్ చేసాడు దర్శకుడు రమణ తేజ. కథ పాతదే కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఉండటంతో అశ్వథ్థాముడు అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేదు. అక్కడక్కడా పర్లేదనిపించే సన్నివేశాలు తప్ప.. సూపర్ అనుకునే సీన్స్ మాత్రం లేవు. రాక్షసుడు తరహా కథ రాసుకున్నా కూడా కథనం మాత్రం అంత పకడ్బందీగా లేదు. అప్పటి వరకు ప్రపంచానికి దొరకని విలన్.. హీరోకు క్లైమాక్స్‌లో చాలా అంటే చాలా ఈజీగా దొరికిపోతాడు. అది మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మంచి కథే తీసుకున్నా కథనంలో లోపాలతో అశ్వథ్థామ వీక్ అయిపోయాడు.

నటీనటులు:

గణ పాత్రలో నాగ శౌర్య బాగా నటించాడు. యాక్షన్ హీరోగా అదరగొట్టాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో చేసాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ తెచ్చుకోడానికి చాలా కష్టపడ్డాడు ఈ హీరో. మెహ్రీన్ కౌర్ పర్లేదు.. సినిమాలో జిస్సుసేన్ గుప్తా విలనిజం అదిరిపోయింది. సైకో విలన్‌గా మెప్పించాడు. పోసాని కృష్ణమురళి ఉన్నవి రెండు సీన్స్ అయినా కూడా ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య సిస్టర్ పాత్ర చేసిన ప్రియ నటన బాగుంది.

టెక్నికల్ టీం:

శ్రీ చరణ్ పాకాల పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. జిబ్రన్ ఆర్ఆర్ మాత్రం బాగుంది. అతడి బ్యాగ్రౌంక్ స్కోర్‌తో సినిమా అక్కడక్కడా మరింత హైలైట్ అయింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్లేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే తీసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్ చాలా వీక్. సెకండాఫ్ బాగుంది. కథ విషయానికి వస్తే నాగశౌర్య మంచి పాయింట్ తీసుకున్నాడు. ఆడవాళ్లను గౌరవించాలి అనేది మంచి లైన్ కానీ దాన్ని స్క్రీన్ ప్లేగా రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. శౌర్య ఇచ్చిన కథను పక్కా కథనంగా మార్చడంలో దర్శకుడు రమణ తేజ తడబడ్డాడేమో అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే కచ్చితంగా మరింత బెటర్ ఔట్ పుట్ వచ్చుండేది.

చివరగా ఒక్కమాట:

హాఫ్ బాయిల్డ్ అశ్వథ్థాముడు..

రేటింగ్: 2.5/5

First published:

Tags: Naga shourya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు