హోమ్ /వార్తలు /సినిమా /

Ashu Reddy: అమ్మాయిల ముద్దుకి ఒక పవర్ ఉంటుంది.. అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Ashu Reddy: అమ్మాయిల ముద్దుకి ఒక పవర్ ఉంటుంది.. అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్!

ashu reddy

ashu reddy

Ashu Reddy: బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన అషు మొదట డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమయ్యింది. పైగా చూడటానికి సమంతల కనిపించడంతో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకుంది.

Ashu Reddy: బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన అషు మొదట డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమయ్యింది. పైగా చూడటానికి సమంతల కనిపించడంతో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకుంది. ఇక వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని బాగా రచ్చ చేసింది.

ఇందులో మరో కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా సన్నిహితంగా ఉండటంతో పాటు తెగ హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది. అంతేకాకుండా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక బుల్లితెరలో కూడా పలు షోలలో పాల్గొని బాగా సందడి చేస్తుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో పాల్గొని మరో ఆర్టిస్ట్ హరితో కూడా బాగా రెచ్చిపోతుంది. ఇక ఇతనితో కూడా ఏదో సంబంధం ఉందని తెగ వార్తలు వినిపించాయి.

ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనిపై చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. నిత్యం పవన్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన పేరు పచ్చబొట్టు కొట్టించడంతో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం యాంకర్ రవి తో కలిసి హ్యాపీ డేస్ అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేస్తుంది అషు. ఇందులో కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు మరికొందరు సెలబ్రెటీలతో బాగా సందడి చేస్తుంటారు.

' isDesktop="true" id="980128" youtubeid="ZOQabdedwhU" category="movies">

తాజాగా ఈ షో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ప్రోమో మొదలు నుండి చివరి వరకు ఫుల్ జోష్ కనిపించింది. పలువురు డైలాగ్స్ తో బాగా అల్లరి చేశారు. ఇక మరో ఆర్టిస్ట్ లేడీ గెటప్ తో వేదికపైకి వచ్చి యాంకర్ రవి నుదిటి మీద ముద్దు పెట్టడంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. అది చూసిన అషు రెడ్డి అమ్మాయిల ముద్దు కి ఒక పవర్ ఉంది అనడంతో వెంటనే రవి.. పవర్ కాదు లిప్ స్టిక్ ఉంది అంటూ పంచ్ వేసాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

First published:

Tags: Anchor ravi, Ashu reddy, Happy days show, Tollywood, Tv show

ఉత్తమ కథలు