ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్ రోల్ పోషిస్తున్న సెలబ్రిటీల్లో అషు రెడ్డి (Ashu Reddy) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అప్ డేట్స్ నెటిజన్లతో పంచుకోవడం, హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేయడం అషు రెడ్డి నైజం. ఏ టూర్ వేసినా కూడా ఆ విషయాలను నెటిజన్లతో పంచుకునే అషు రెడ్డి.. తాజాగా ఓ వీడియో షేర్ చేసి హాట్ టాపిక్ అయింది.
ఈ వీడియోలో యాంకర్ రవితో (Anchor Ravi) కలిసి కనిపించింది అషు. ఇందులో ఇద్దరు స్కూటీపై కూర్చుని లాంగ్ డ్రైవ్ పోదామా అంటూ ఉండే లవ్ టుడే పాటకు రీల్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది అషు. ఇందులో చిరిగిన జీన్స్ తో థైస్ కనిపించేలా హాట్ గా దర్శనమిచ్చింది అషు రెడ్డి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
అందాల ఆరబోతలో అషు రెడ్డిని మించిన బ్యూటీ ఇంకెవరూ ఉండరనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ అందరి ముందు పెట్టి హీటెక్కించడం అషు రెడ్డి హ్యబీ. రోజు రోజుకు శృతిమించి తన అందాలను ఆరబోస్తూ నెట్టింట హంగామా చేస్తోంది అషు. దీంతో ఈ అమ్మడికి సంబంధించిన ఇష్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చెప్పుకుంటూ జనాల్లో క్రేజ్ కొట్టేసింది అషు రెడ్డి. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు. అషు రెడ్డికి జూనియర్ సమంతగా కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇదే మార్క్ తో తన లేలేత ప్రాయాలను వడ్డిస్తున్న ఈ భామ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. వర్మ లాంటి బడా దర్శకుడు సైతం అషు పాదాల వద్ద కుర్చున్నాడంటే అమ్మడి క్రేజ్ ఎలాటిందో అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పిన అషు రెడ్డి.. ఇటీవలే మరోసారి అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో క్లిప్స్ ఇప్పటికీ నెట్టింట ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Ashu reddy, Telugu tv anchors