అయ్య బాబోయ్ అషు రెడ్డి (Ashu Reddy) అన్నట్లుగా ఉంది అమ్మడి తీరు. ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది అషు. పబ్లిసిటీ కోసం డిఫరెంట్ దారుల్లో వెళుతున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా పెళ్ళైన వారానికే మొగుడిని చంపేస్తా అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ వదిలింది. ఓ రీల్ వీడియో చేస్తూ అషు రెడ్డి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యా మీనన్ చెప్పిన డైలాగ్ అయితే దీనికి స్పూఫ్ చేసి నెటిజన్ల చూపు తిప్పుకుంది అషు రెడ్డి. ఈ వీడియో చుసిన జనం తెగ కామెంట్లు పెడుతున్నారు. అవును నువ్వు ఆ టైపే కదా అంటూ అషుపై తమ ఫీలింగ్స్ బయటపెడుతున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను తెగ షేర్ చేసుకుంటూ అషుపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram
గతంలో కూడా అషు రెడ్డి ఇలాంటి ఎన్నో వీడియోలు చేసి వార్తల్లో నిలిచింది. తాను తల్లిని అయ్యానంటూ అప్పట్లో అషురెడ్డి చేసిన ఓ వీడియో సెన్సేషన్ అయింది. మనసులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా ఉంటూ బోల్డ్ మాటలతో పిచ్చెక్కించే అషు.. పవన్ కళ్యాణ్ ఓకే అంటే నాలుగో భార్యను అవుతా అని కూడా చెప్పింది. ఏదైతే ఏంటి ఎలాగైనా ఫేమస్ కావాలి అనే కోణంలోనే అడుగులేస్తోంది అషు.
మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి అందాల తడితో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అందాలతో మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. డిఫరెంట్ టైప్ పోజులతో నెట్టింట మంట పెడుతోంది. హాట్ డోస్ దట్టిస్తూ ఎప్పటికప్పుడు ఈ అమ్మడు వదులుతున్న ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. గ్లామర్ వడ్డించడమే ప్రధాన లక్ష్యంగా దూసుకుపోతోంది అషు రెడ్డి. రోజు రోజుకు శృతిమించి తన అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ.. పలు వెబ్ సిరీసులు చేస్తూనే సినిమా అవకాశాలు కూడా పట్టేస్తోంది.
అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పిన అషు రెడ్డి.. ఇటీవలే మరోసారి అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి రచ్చ రచ్చ చేసింది. శృంగార సంబంధిత విషయాలు, బోల్డ్ మాటలతో మాయ చేసింది. ప్రస్తుతం నెట్టింట అషు రెడ్డి ట్రెండ్ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashu reddy, Bigg Boss, Telugu tv anchors