Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లో కూడా అవకాశం అందుకొని మంచి సెలబ్రిటి హోదాను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటూ.. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఒకతని వల్ల తన జీవితం నాశనం అయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.
డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సమంతలా కనిపించడంతో జూనియర్ సమంతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తన పరిచయాన్ని ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లో పెంచుకుంది. ఇందులో ఉన్నంతకాలం తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంది. ఈ షో తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా సన్నిహితంగా ఉంటూ హాట్ టాపిక్ గా మారింది. అతనితో ప్రేమలో ఉన్నట్లు.. డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తమ మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం చూపిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఆయన పేరును టాటూగా కొట్టించి పవన్ అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. ఇక ప్రస్తుతం బుల్లితెరలో స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మరో కమెడియన్ హరితో కలిసి స్కిట్ లు చేస్తూ బాగా రెచ్చిపోతుంది. గతంలో హరితో కూడా ప్రేమలో ఉందని బాగా పుకార్లు కూడా వచ్చాయి.
View this post on Instagram
అంతేకాకుండా యాంకర్ రవితో కలిసి హ్యాపీ డేస్ అనే షోలో యాంకరింగ్ చేస్తూ బాగా రెచ్చిపోతుంది. పొట్టి పొట్టి బట్టలతో అందరి దృష్టిని తన వైపు మలుపుకుంటుంది. ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో పంచుకుంది. అందులో ఏదో షో కోసం స్కూల్ యూనిఫామ్ ధరించింది. అంతేకాకుండా తన పక్కన కో-డైరెక్టర్ రాకేష్ తో పాటు మరో వ్యక్తి ఉండగా.. వారిని.. 'ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా.. వాడి వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్లమీద తిప్పితిప్పి పిప్పి చేశాడంటూ' బ్రహ్మానందం డైలాగ్ ను ఉపయోగించి వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashu reddy, Comedy stars, Happy days, Instagram