హోమ్ /వార్తలు /సినిమా /

Ashnoor Kaur: సీబీఎస్ఈ పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించిన నటి అష్నూర్‌ కౌర్.. దాని గురించి ఏం చెబుతోందంటే?

Ashnoor Kaur: సీబీఎస్ఈ పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించిన నటి అష్నూర్‌ కౌర్.. దాని గురించి ఏం చెబుతోందంటే?

Ashnoor Kaur

Ashnoor Kaur

Ashnoor Kaur: సీబీఎస్ఈ తాజాగా 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. బుల్లితెర నటి అష్నూర్‌ కౌర్ కూడా ఈ పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించి ప్?

Ashnoor Kaur: సీబీఎస్ఈ తాజాగా 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల బోర్డ్ ఎగ్జామ్స్ రద్దైనా అంతకుముందే విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో చాలామంది మంచి మార్కులను సాధించారు. అయితే బుల్లితెర నటి అష్నూర్‌ కౌర్ కూడా ఈ పరీక్షల్లో 94 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఆమె మీడియాతో కూడా పంచుకుంది. ఈ సంవత్సరం యాక్టింగ్ ప్రాజెక్ట్స్ పెద్దగా చేయకుండా.. బోర్డ్ పరీక్షలపైనే దృష్టి పెట్టానని చెప్పింది. పదో తరగతి మార్కుల కంటే ఎక్కువ స్కోర్ పొందాలనే లక్ష్యంతో చదివినట్టు తెలిపింది. తాను సాధించిన మార్కులు చూస్తే చాలా ఆనందంగా, గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది.

కరోనా వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా కేవలం ఆన్ లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు. దీని గురించి కూడా అష్నూర్‌ మాట్లాడింది. "మాకు పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. రిజల్ట్స్ ఎలా ప్రకటిస్తారో తెలియదు. కానీ ప్రతి పరీక్షలోనూ మా బెస్ట్ అందించాం. నేను, నా స్నేహితులు కలవలేకపోయామన్న బాధ ఉంది. ఆఖరి సంవత్సరం బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ అది జరగలేదు. కానీ ఆన్ లైన్ క్లాసుల వల్ల నేను షూటింగ్ కి వెళ్లే సమయంలోనూ క్లాసులు వినగలిగాను. మా గత పరీక్షల ఫలితాలను చెక్ చేసి వాటి ఆధారంగా రిజల్ట్స్ అందించిన సీబీఎస్ఈకి నా ధన్యవాదాలు. నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడాలన్నదే నా కోరిక. నేను రిజల్ట్స్ చెక్ చేసినప్పుడు నా తల్లిదండ్రులు నాతో పాటు ఉన్నారు. మేమంతా రిజల్ట్స్ చూసి ఆనందంలో ఎగిరి గంతేశాం. ఆ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పింది.

ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీల ఎంపికలో బిజీగా ఉంది అష్నూర్‌. ఆ తర్వాత వెకేషన్ కి వెళ్తామని వెల్లడిస్తోంది. "మేం ఒక వెకేషన్ కి వెళ్లాలనుకుంటున్నాం. రిజల్ట్స్ రాగానే మేం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నా డైట్ ని పక్కన పెట్టి ఫుల్ గా తినేశాను. ప్రస్తుతం నేను మాస్ మీడియాలో బ్యాచిలర్స్ కోర్సు చేయాలనుకుంటున్నా. దాని కోసం కాలేజీలు వెతికే ప్రయత్నంలో ఉన్నాను. ఆ తర్వాత నేను ప్రస్తుతం ఉన్న రంగంలో కూడా కాస్త నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నా. ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్ కి సంబంధించిన కోర్సులు కూడా చేస్తాను. కాలేజీ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. అటు నటన, ఇటు కాలేజీ రెండూ కొనసాగిస్తాను. ముంబైలోనే చదువుకుంటాను’’ అని వివరించింది.

Ashnoor Kaur

నటీనటులపై చాలామందికి ఓ ఫీలింగ్ ఉంటుంది. వారు చదువులో ఎప్పుడూ వెనుకబడి ఉంటారు అని కొందరు అనుకుంటారు. ఈ భావన తప్పని నిరూపించాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది ఈ నటి. ‘నటీనటులు తెలివైన వారు కారు అనుకోవడం సరైనది కాదు. వాళ్ల ఎంపికపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నాకు ఎన్నో సినీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను సరైన మూమెంట్, పాత్ర కోసం వేచి చూస్తున్నా. టీనేజర్ రోల్స్ నుంచి దూరమై.. హీరోయిన్ రోల్స్ లో నన్ను నేను చూసుకోవాలని భావిస్తున్నా. పాత్ర బాగుంటే ఏ ప్లాట్ ఫాంలోనైనా పని చేస్తా" అంటూ వెల్లడించింది అష్నూర్‌. ఆమె వివిధ నేషనల్ ఛానెల్స్ లో ఎన్నో సీరియళ్లు, ప్రకటనల్లో నటిస్తూ అందరికీ పరిచితమైన సంగతి తెలిసిందే.

First published:

Tags: Acting career, Anshoor kaur, Education CBSE, Results, Under graduation

ఉత్తమ కథలు