ర‌ష్మిక తన గ్లామర్ డోస్ పెంచేసిందిగా... ఇదిగో సాక్ష్యం..

శాండిల్‌ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నకి ఇప్పుడు టాలీవుడ్‌లో రోజు రోజుకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. ఒకవైపు కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో సత్తా చూపెడుతూనే  మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా పాగా వేయాలని  ట్రై చేస్తుంది. తాజాగా ఈ భామ..

news18-telugu
Updated: January 16, 2020, 3:47 PM IST
ర‌ష్మిక తన గ్లామర్ డోస్ పెంచేసిందిగా... ఇదిగో సాక్ష్యం..
రష్మిక మందన్న (Twitter/Photo)
  • Share this:
శాండిల్‌ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నకి ఇప్పుడు టాలీవుడ్‌లో రోజు రోజుకు తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. ఒకవైపు కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో సత్తా చూపెడుతూనే  మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా పాగా వేయాలని  ట్రై చేస్తుంది. తాజాగా రష్మిక  సూపర్ స్టార్ మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ  సినిమా రష్మిక అందాలు చూసి  ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.  ఏ సినిమాలో లేనట్టుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మిక అందం, అభినయం, డ్యాన్స్‌, గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కొన్ని సీన్స్‌లో అయితే.. మహేష్ బాబును కూడా డామినేట్  చేసిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ సినిమాలో రష్మిక తన మ్యానరిజంకు భిన్నంగా ఢిఫరెంట్‌గా కనిపించిందని కొందరి ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  ఈ సినిమాలో రష్మిక పదే పదే హీరో మీద పడిపోవటం కాస్త ఓవరైందని క్లాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు.సినిమాలోని ఒక పాటలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేంత ఎక్స్‌ఫపోజింగ్ పెంచేసిందనే చెప్పుకుంటున్నారు. మరి రష్మిక ఈ విమర్శల్ని సీరియస్ తీసుకుంటుందా అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ వాళ్లకు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వాడుకుంటూ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చచేస్తున్నారు.

(Image: Rashmika Mandanna/instagram)


స్కిన్ షోస్ తో ఒకవైపు దర్శక నిర్మాతలను మరోవైపు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వుంటారు. అంతేకాదు సోషమీడియా ద్వారా తమకు అందాల ఆర‌బోత‌కూ ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని సందేశాలనిస్తూనే వుంటారు. ఇప్పటి వరకు రష్మిక హోమ్లీగానే ఫ్యాన్స్‌ను కనువిందు చేస్తూ వస్తోంది. ఇప్పుడు తనకున్న క్లాస్ ఇమేజ్ కాదని మాస్ ఆడియన్స్ కోసం తన గ్లామర్ డోస్ పెంచేస్తుందా లేక క్లాస్ గానే ఫాన్స్ ను ఆకట్టుకుంటుందా అనేది ముందు ముందు చూడాలి.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>