• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • AS SHOOTING IN FOG IS SO HARD PRIYANKA CHOPRA SHOCKED TO SEE DELHI POLLUSION TODAY NK

ఢిల్లీలో ఆగిన ఫిల్మ్ షూటింగ్... ప్రియాంక చోప్రా అలర్ట్ మెసేజ్

ప్రియాంక చోప్రా (credit - insta -

Delhi Pollusion : ఢిల్లీలో వాయు కాలుష్యం అందర్నీ ఇబ్బంది పెట్టేస్తోంది. పనులేవీ ముందుగు సాగట్లేదు. సినిమా షూటింగ్‌లపైనా దీని ప్రభావం పడింది.

  • Share this:
    Delhi Pollusion : ఢిల్లీ కాలుష్యంపై రాజకీయ రగడ మొదలైంది. ఢిల్లీలో పెద్ద ఎత్తున పొగ వచ్చి... వాయు కాలుష్యం పెరిగిపోవడానికి... చుట్టుపక్కల రాష్ట్రాలే కారణమని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. అసలా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగలబెట్టకుండా చెయ్యాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్న కేజ్రీవాల్... ఈ విషయంలో కేంద్రం ఒక్కసారీ ఆ రాష్ట్రాలతో సమావేశం పెట్టి మాట్లాడలేదని మండిపడ్డారు. ఆయన ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం... బీజేపీ నేత విజయ్ గోయలే కారణం. ఆయన ఏం చేశారంటే... ఇవాళ ఢిల్లీలో అమల్లోకి సరి, బేసి సంఖ్య విధానం అమల్లోకి వస్తే... దాన్ని ఉల్లంఘించారు విజయ్ గోయల్. సరి సంఖ్య ఉన్న వాహనంలో రావాల్సిన ఆయన... బేసి సంఖ్య ఉన్న వాహనంలో వచ్చారు. ఆయన వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు ఫైన్ వెయ్యబోతుంటే... ఢిల్లీ ప్రభుత్వంపై గోయల్ మండిపడ్డారు. సరిబేసి సంఖ్య విధానం ఓ రాజకీయ జిమ్మిక్కు అంటూ రివర్స్ అయ్యారు. ఐదేళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు చేసిందేమీ లేదని తిరగబడ్డారు. ఇలా ఢిల్లీ కాలుష్యం రాజకీయ రగడకు కారణమైంది.



    ఇదే పరిస్థితిపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనదైన మార్కుతో స్పందించింది. ప్రస్తుతం ఆమె ది వైట్ టైగర్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నది ఢిల్లీ పరిసరాల్లోనే. షూటింగ్ జరపడం చాలా కష్టంగా ఉందన్న పింకీ చాప్స్... అసలు ఇక్కడి ప్రజలు ఇలాంటి పొల్యూషన్‌లో ఎలా జీవిస్తున్నారో ఏమో అని ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కరూ ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్కులూ ధరించాలనీ, తాము కూడా వాటిని ధరిస్తున్నామని తెలిపింది. గూడు లేని వారిని దేవుడు కాపాడాలని ప్రార్థించాలని కోరింది. ప్రతి ఒక్కరూ సేఫ్‌గా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ప్రియాంక చోప్రా.



    ఢిల్లీలో పరిస్థితి ఇలా ఉంది కాబట్టే... కేజ్రీవాల్ ప్రభుత్వం 15వ తేదీ వరకూ సరిబేసి సంఖ్య విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ... ఇందుకు బీజేపీ నేతలు సహకరించకపోవడం సమస్యే. ప్రజలు మాత్రం ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ... రూల్స్ ఫాలో అవుతున్నారు.

     

    Pics : అందాల తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ క్యూట్ స్టిల్స్




    ఇవి కూడా చదవండి :

    మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?

    యూనివర్శిటీకి సాఫ్ట్ టాయ్స్ తెస్తున్న ప్రొఫెసర్... ఎందుకో తెలిస్తే మీరే మెచ్చుకుంటారు

    Bigg Boss 3 | శ్రీముఖికి ప్లస్సా, మైనస్సా?

    డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

    Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు

    First published: