AS PER SOURCE NIKHIL SIDDHARTH KARTHIKEYA 2 POST PONED SLB
Nikhil Siddharth: కార్తికేయ 2 మరోసారి వాయిదా! నిఖిల్ సినిమా పరిస్థితి ఇలా ఉందేంటి..?
కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)
కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్.. మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
టాలెంటెడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth) కొత్త సినిమా కార్తికేయ 2 (Karthikeya 2). కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా జూలై 22న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్.. మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త ఆలస్యం అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు.
కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తికేయ 2. చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.