ప్రస్తుతం బాలయ్య, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘పింక్’ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి’ పేరుతో రీమేక్ చేసారు. ఈ నెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.మరోవైపు ‘పింక్’ తెలుగు సినిమా రీమేక్ రైట్స్ దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఇక్కడ బాలయ్యతో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ‘పింక్’ వంటి సబ్జెక్ట్ బాలయ్య వంటి మాస్ హీరోకు సూట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న... దిల్ రాజు మాత్రం బాలయ్యతో ఈ క్యారెక్టర్ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.
అలా ఉండగా ‘పింక్’ తెలుగు సినిమా రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ 'లాయర్ సాబ్' సినిమాను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెలుగులో నిర్మించాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో కథ ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ ఏజ్డ్ క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్ లేదు. అదే తమిళ్ విషయానికచ్చేసరికి అజిత్ సరసన విద్యాబాలన్ యాక్ట్ చేసింది. మరి బాలకృష్ణ..హిందీలో అమితాబ్ బచ్చన్ చేసినట్టు హీరోయిన్ లేకుండా యాక్ట్ చేసే సాహసం చేస్తాడా ? ఒకవేళ చేస్తే అభిమానులు ఒప్పుకుంటారా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే కథానాయికగా లేకుండా బాలయ్యను ఈ సినిమాలో కొత్తగా చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. ఒకవేళ తమిళంలో లాగే తెలుగులో హీరోయిన్ను పెట్టాల్సిన పరిస్థితులు వస్తే.. తమిళంలో అజిత్ సరసన యాక్ట్ చేసిన విద్యాబాలన్‌ను హీరోయిన్గా తీసుకుంటారా అనేది చూడాలి. ఏమైనా ‘పింక్’ తెలుగు రీమేక్ ‘లాయర్ సాబ్’లో బాలయ్య ఎలా కనిపిస్తాడనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajith, Balakrishna, Big B, Bollywood, Hindi Cinema, Lawyer Saab Telugu Movie, NBK, Pink, Taapsee, Telugu Cinema, Tollywood, Vidya Balan