హోమ్ /వార్తలు /సినిమా /

ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్న మంచు మనోజ్..

ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్న మంచు మనోజ్..

బాలకృష్ణ,మంచు మనోజ్ (Twitter/Photo)

బాలకృష్ణ,మంచు మనోజ్ (Twitter/Photo)

Balakrishna Manchu Manoj | అవును మంచు మనోజ్.. తాజాగా చేయబోతున్న సినిమా కోసం బాలకృష్ణను ఆదర్శంగా తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

  అవును మంచు మనోజ్.. తాజాగా చేయబోతున్న సినిమా కోసం బాలకృష్ణను ఆదర్శంగా తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంచు మనోజ్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మాసి’ అనే కొత్త సినిమాను  ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను మంచు మనోజ్ తన పేరు కలిసొచ్చేలా  ఎం ఎం ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ  చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో మంచు మనోజ్ అఘోర పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఈ పాత్రే కీలకం అని చెబుతున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా .. బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాలో అఘోర పాత్రలో మెప్పించబోతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినబడుతోంది. ఈ నెలాఖరులో కాశీలో బాలయ్య..అఘోర గెెటప్‌కు సంబంధించిన సీన్స్‌తో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో 15 నిమిషాల పాటు అఘోర పాత్రకు సంబంధించిన సీన్స్ ఈ చిత్రానికే కీలకం అని చెబుతున్నారు.

  as like nandamuri balakrishna hero manchu manoj to play aghora charecter in his next film aham bramhasmi movie ,ఆ విషయంలో బాలయ్యను ఆదర్శంగా తీసుకున్న మంచు మనోజ్..,balakrishna,manchu manoj mm arts,balakrishna manchu manoj,bala krishna manchu manoj,balayya,nbk,balakrishna as aghora,manchu manoj as aghora,manchu manoj aham brahmasmi,aham brahmasmi movie,balakrishna boyapati srinu movie aghora movie,Manchu manoj own production house,mm arts,manchu manoj starts produtcion house,Manchu Manoj,Manchu Manoj twitter,Manchu Manoj divorce,manchu manoj divorce confirm,Manchu Manoj movies,Manchu Manoj instagram,Manchu Manoj movies,Manchu Manoj,manchu manoj wife,manchu manoj wedding,manchu manoj interview,manchu manoj wife pranathi,manchu manoj divorce,manchu manoj divorce issue,manchu manoj marriage,manchu manoj family,actor manchu manoj,manchu manoj latest news,మంచు మనోజ్,మంచు మనోజ్ పెళ్లి,మంచు మనోజ్ విడాకులు,తెలుగు సినిమా,మంచు మనోజ్ భార్య ప్రణతి,మంచు మనోజ్ మరో కీలక నిర్ణయం,మంచు మనోజ్ సంచలన నిర్ణయం,మంచు మనోజ్ ప్రొడక్షన్ హౌస్,ఎంఎం ప్రొడక్షన్స్,అహం బ్రహ్మాస్మి,అహం బ్రహ్మాస్మి మంచు మనోజ్,మంచు మనోజ్ అఘోర,అఘోర పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ బోయపాటి శ్రీను,
  మంచు మనోజ్,బాలకృష్ణ(Twitter/Photo)

  ఇక మూడేళ్ల  లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొస్తున్న మనోజ్ కూడా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో అఘోర పాత్రలో కనిపించనున్నాడు. ఈ  రెండు సినిమాలు కూడా  ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఎవరు అఘోరగా మెప్పిస్తారనేది చూడాలి. గతంలో బాలకృష్ణ..  మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తాజాగా బాలకృష్ణ, మంచు మనోజ్..ఒకేసారి అఘోర పాత్రతో  ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఏమైనా కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌తో నైనా వీళ్లిద్దరు హిట్ ట్రాక్ ఎక్కుతారా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Boyapati Srinu, Manchu Manoj, NBK 106, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు