news18-telugu
Updated: November 23, 2019, 10:57 AM IST
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Balakrsihna)
అవును ఎన్టీఆర్ ఇపుడు బాబాయి బాలకృష్ణలా ఆ తప్పు చేయనని ఖరాఖండిగా చెప్పేసాడట. గత కొన్నిరోజులుగా టాలీవుడ్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో అన్న ఎన్టీఆర్ బయోపిక్ పై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య..అన్నగారి పాత్రలో ఒదిగిపోయినా.. ఒకే పార్టుగా కాకుండా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మరోవైపు తమిళనాడును తన కనుసైగలతో శాసించిన పురుచ్చితలైవి జయలలిత జీవితంపై పలు బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అందులో కంగనా ముఖ్యపాత్రలో ఏ.ఎల్.విజయ్.. ‘తలైవి’ పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి.. ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు.ఇక జయలలిత జీవితంలో ఎమ్జీఆర్తో పాటు ఎన్టీఆర్ పాత్రకు మంచి ప్రాధాన్యతే ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ (File Photo)
అంతేకాదు జయలలిత తెలుగులో అన్న ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.వెండితెరపై వారిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉండేది. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు తగినంత ప్రాధాన్యం ఇచ్చారట చిత్ర నిర్మాతలు. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకోసం ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన హీరోను తీసుకుంటే.. ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని నిర్మాతలు భావించారు. ఈ విషయమై నిర్మాత విష్ణు ఇందూరి అన్నగారి పాత్రకోసం ముందుగా బాలకృష్ణను సంప్రదించారట. కానీ బాలకృష్ణ మరోసారి నాన్నగారి క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్ట లేదని టాక్. ఆ తర్వాతే నెక్ట్స్ ఆప్షన్‌గా చిత్ర యూనిట్ అన్నగారి క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదించి అన్నగారి పాత్ర చేయమని రిక్వెస్ట్ చేసారట. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు ‘మహానటి2 సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేయమని నిర్మాత అశ్వినీదత్‌తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేసినా..ఆ క్యారెక్టర్ చేయనని సున్నితంగా రిజెక్ట్ చేసాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా జయలలిత బయోపిక్ నిర్మాతలకు ఈ పాత్ర చేయనని స్పష్టం చేసాడట. మొత్తానికి తారక్‌ను అన్నగారి పాత్రలో చూడాలనుకున్న అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని విషయమే.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 23, 2019, 10:57 AM IST