అక్కనేని ఫ్యామిలీ హీరోలందరు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మనం’ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లోకనిపించి అభిమానులకు కనువిందు చేసారు. ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మోహన్ బాబుకు చెందిన మంచు ఫ్యామిలీ హీరోలు మనోజ్, విష్ణులు కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీ గెస్ట్ పాత్రలో మెరిసింది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణకు చెందిన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇలాంటి సినిమానే రాబోతుందా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
సూపర్ స్టార్స్ కృష్ణ,మహేష్ బాబు,గౌతమ్ కృష్ణ (Twitter/Photo)
టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో నమ్రత, మహేష్ బాబు పిల్లలు కథకు అనుగుణంగా ఉండే పాత్రల్లో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మహేష్ బాబు చిన్నపుడు కృష్ణ నటించిన చాలా చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ సినిమాల్లో తండ్రి కృష్ణతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
భార్య పిల్లలతో మహేశ్ బాబు
ఇందులో వంశీ సినిమాలో అటు తండ్రి కృష్ణ, ఇటు భార్య నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతున్నట్టు ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఒకే వేళ నటిస్తే.. తెలుగులో ఒకే సినిమాలో కలిసి నటించిన మూడు తరాల హీరోలుగా ఘట్టమనేని మిగిలిపోనుంది. హిందీలో మాత్రం కపూర్ ఫ్యామిలీ హీరోలు పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్,రణ్‌దీర్ కపూర్లు ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలో మూడు తరాలు కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.