సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు దీపికా పదుకొణె కౌంటర్

సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై దీపికా రియాక్ట్ అయ్యింది. డిప్రెషన్‌కు గురికావాలని ఎవరూ కోరుకోరని సల్లూభాయ్‌కు కౌంటర్ ఇచ్చింది.

news18-telugu
Updated: August 7, 2019, 9:19 AM IST
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు దీపికా పదుకొణె కౌంటర్
దీపికా పదుకొణె, సల్మాన్ ఖాన్
  • Share this:
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె. గతంలో డిప్రెషన్‌పై దీపికా చేసిన వ్యాఖ్యలపై ఇటీవలే సల్మాన్ ఖాన్ స్పందించాడు. చాలామంది కుంగుబాటుకు గురై భావోద్వేగంగా ప్రవర్తించడం చూశానన్నారు. అయితే డిప్రెషన్‌లో తాను మాత్రం ఆనందాన్ిన అనుభవించలేదన్నారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని దాటుకొని వెళ్తుంటానన్నారు సల్లుభాయ్. అయితే సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై దీపికా రియాక్ట్ అయ్యింది. డిప్రెషన్‌కు గురికావాలని ఎవరూ కోరుకోరని సల్లూభాయ్‌కు కౌంటర్ ఇచ్చింది.

‘నేను కుంగుబాటుతో పోరాటం చేశా. ప్రతి క్షణం ఓ నరకంలా ఉండేది. రోజురోజుకీ క్షీణించిపోతున్న భావన కలిగేది. కానీ ప్రజలకు ఇది మరోలా అర్థం కావడం బాధాకరం. ఇటీవల ఓ హీరో ‘డిప్రెషన్‌లోని ఆనందాన్ని నేను అనుభవించలేదు’ అన్నాడు. కుంగుబాటు అనేది మనం ఎంచుకునేదా?’ అని దీపిక ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య నెలకొన్న మాటల యుద్ధం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కుంగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె ఒకప్పుడు మీడియాతో పంచుకున్నారు.

 

 
First published: August 7, 2019, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading