బాలకృష్ణ ఆ సినిమా కోసం అంత రిస్క్ చేస్తాడా..

ప్రస్తుతం బాలయ్య, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలో బాలకృష్ణ.. డిఫరెంట్ గెటప్‌లో కనపించి ఆడియన్స్‌కు షాక్ ఇచ్చాడు. తాజాగా బాలకృష్ణ తన కొత్త సినిమా కోసం రిస్క్ తీసుకుంటున్నాడు.

news18-telugu
Updated: October 5, 2019, 12:36 PM IST
బాలకృష్ణ ఆ సినిమా కోసం అంత రిస్క్ చేస్తాడా..
బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం బాలయ్య, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలో బాలకృష్ణ.. డిఫరెంట్ గెటప్‌లో కనపించి ఆడియన్స్‌కు షాక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం నందమూరి నట సింహం దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత చేయబోయే బోయపాటి శ్రీను సినిమా కోసం మరో 15 కిలోల బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ సినిమాను ‘మిషన్ ఇంపాజిబుల్’ తరహాలో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. ఈ సినిమా తర్వాత బాలయ్య.. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ‘పింక్’ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి’ పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్నే సాధించింది. మరోవైపు ‘పింక్’ తెలుగు సినిమా రీమేక్ రైట్స్ దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాను ఇక్కడ బాలకృష్ణతో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ‘పింక్’ వంటి సబ్జెక్ట్  బాలయ్య వంటి మాస్ హీరోకు సూట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న... దిల్ రాజు మాత్రం బాలయ్యతో ఈ క్యారెక్టర్ చేయించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.

Nandamuri Balakrishna Will Remake Amitabh bachchan's Pink movie In Telugu,Nandamuri Balakrishna,Amitabh bachchan,Nandamuri Balakrishna Amitabh bachchan,balayya,nbk,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,Amitabh bachchan twitter,Amitabh bachchan instagram,Amitabh bachchan facebook,balakrishna remake pink,balakrishna will remake pink movie,balakrishna political,balakrishna controversy,balakrishna court,balakrishna movies,balakrishna ks ravikumar movie,tollywood,telugu cinema,big b,big bachchan,andhra pradesh news,andhra pradesh politics,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,అమితాబ్ బచ్చన్,బాలకృష్ణ అమితాబ్ బచ్చన్,బిగ్ బీ,బిగ్ బీ పింక్ రీమేక్‌లో బాలకృష్ణ,పింక్ రీమేక్‌ బాలయ్య,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,

ఈ మూవీకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ 'లాయర్ సాబ్' సినిమాను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెలుగులో నిర్మించాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో కథ ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ ఏజ్‌డ్ క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్ లేదు. అదే తమిళ్ విషయానికచ్చేసరికి అజిత్ సరసన విద్యాబాలన్ యాక్ట్ చేసింది. మరి బాలకృష్ణ..హిందీలో  అమితాబ్ బచ్చన్ చేసినట్టు  హీరోయిన్ లేకుండా యాక్ట్ చేసే సాహసం చేస్తాడా ? ఒకవేళ చేస్తే అభిమానులు ఒప్పుకుంటారా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే కథానాయికగా లేకుండా బాలయ్యను ఈ సినిమాలో కొత్తగా చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. ఒకవేళ తమిళంలో లాగే తెలుగులో హీరోయిన్‌ను పెట్టాల్సిన పరిస్థితులు వస్తే..  తమిళంలో అజిత్ సరసన  యాక్ట్ చేసిన విద్యాబాలన్‌ను హీరోయిన్‌గా తీసుకుంటారా అనేది చూడాలి. ఏమైనా ‘పింక్’ తెలుగు రీమేక్ ‘లాయర్ సాబ్’లో బాలయ్య ఎలా కనిపిస్తాడనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
First published: October 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading