"శుక్ర", "మాటరాని మౌనమిది" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్నారు సుకు పూర్వాజ్ (Suku Purvaj ). కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఇక లేటెస్ట్గా ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా "ఏ మాస్టర్ పీస్" (A Masterpiece ) కు శ్రీకారం చుట్టారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ దర్శకుడి గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందో..
#Arvindkrishna as Mŕ. A New Telugu Super Hero, Ever seen #AMasterpiece Project #3 @sukupurvaj#SrikanthKandragula @ria_purvaj #snehagupta #Cinemabandiprodution @Gskmedia_PR #AMP
Cast & Crew details soon pic.twitter.com/cVE2fZvbft — Vamsi Kaka (@vamsikaka) December 8, 2022
'లైఫ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్ దట్ యూ క్రియేట్, యూ ఆర్ ఏ మాస్టర్ పీస్. బట్ హూ ఆర్ యూ. వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎ సూపర్ హీరో మిస్టర్ ఏ'...అంటూ ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా కోట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో త్వరలోషూట్కు వెళ్లనుంది. అంతేకాదు అతి త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేయనుంది టీమ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news