• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ARTIST JAYALALITA EMOTIONAL ABOUT HER LEFE ALITHO SARADAGA SHOW LATEST PROMO MNJ

Jayalalita: ఒక‌ప్పుడు కార్లలో తిరిగా.. ఇప్పుడు క్యాబ్‌లో వ‌స్తున్నా.. వారి వ‌ల్ల‌నే ఈ స్థితికి వ‌చ్చా

Jayalalita: ఒక‌ప్పుడు కార్లలో తిరిగా.. ఇప్పుడు క్యాబ్‌లో వ‌స్తున్నా.. వారి వ‌ల్ల‌నే ఈ స్థితికి వ‌చ్చా

జయలలిత

Jayalalita: ప‌రిస్థితులు ఎవ‌రిని ఎప్పుడు ఎలా మారుస్తాయో ఎవ్వ‌రికీ తెలీదు. ఒక‌ప్పుడు బాగా ఉన్న వాళ్లు త‌రువాత ఏం లేకుండా అయిపోవ‌చ్చు. ఒక‌ప్పుడు ఏమీ లేని వాళ్లు త‌రువాత డ‌బ్బు, పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించుకోవ‌చ్చు. ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ రెండు ర‌కాల వాళ్లు ఉంటారు. డ‌బ్బుల‌ను విరాళంగా ఇచ్చేస్తూ కొంద‌రు,

  • Last Updated:
  • Share this:
    Jayalalita: ప‌రిస్థితులు ఎవ‌రిని ఎప్పుడు ఎలా మారుస్తాయో ఎవ్వ‌రికీ తెలీదు. ఒక‌ప్పుడు బాగా ఉన్న వాళ్లు త‌రువాత ఏం లేకుండా అయిపోవ‌చ్చు. ఒక‌ప్పుడు ఏమీ లేని వాళ్లు త‌రువాత డ‌బ్బు, పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించుకోవ‌చ్చు. ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌లోనూ రెండు ర‌కాల వాళ్లు ఉంటారు. డ‌బ్బుల‌ను విరాళంగా ఇచ్చేస్తూ కొంద‌రు, డ‌బ్బుల‌ను విరివిగా వాడుకుంటూ ఇంకొంద‌రు, వ్య‌క్తుల‌ను మోస‌పోయి మ‌రికొంద‌రు.. త‌మ‌కంటూ ఏం లేకుండా చేసుకున్నారు. ఈ లిస్ట్‌లో మ‌హాన‌టి సావిత్రి స‌హా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నాన‌న్నారు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ జ‌య‌ల‌లిత‌. ఏప్రిల్ 1న విడుద‌ల‌, భ‌ర‌త్ అనే నేను, గ్యాంగ్ లీడ‌ర్, ఇంద్రుడు-చంద్రుడు.. ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించిన జ‌య‌ల‌లిత అలీ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అలీతో స‌ర‌దాగాలో పాల్గొన్నారు.

    మ‌రో న‌టి వ‌రల‌క్ష్మితో పాటు ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ జీవిత విశేషాల‌ను పంచుకున్నారు. క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకున్న మీరు ఐట‌మ్ పాట‌లకు ఎలా ఒప్పుకున్నారు అని అలీ అడ‌గ్గా.. అప్ప‌టి ప‌రిస్థితుల్లో అంద‌రం ఇక్క‌డ‌కు వ‌చ్చేశాము. కుటుంబాన్ని చూసుకోవాల్సి వ‌చ్చింది. వెన‌క్కి వెళ్ల‌లేము. అందుకే ఆ పాత్ర‌ల‌కు కూడా ఒప్పుకున్నా. అయినా ఆ పాత్ర‌ల‌కు నేను సెట్ అవ్వ‌న‌ని నాకు తెలుసు.. కానీ ప్రేక్ష‌కుల‌ను అవే న‌చ్చాయి అని చెప్పుకొచ్చారు.


    ఇక సాధార‌ణంగా ఒక‌టి, రెండు, మూడు సార్లు మోస‌పోతారు. మీరు ఎలా మోస‌పోయారు అని అలీ అడ‌గ్గా.. వాళ్లు విజ‌య‌న‌గ‌రం రాజులు. డ‌బ్బులు క‌ట్ట‌లేక‌పోతున్నాము, సీరియ‌ల్స్ ఆగిపోతాయి అంటే నా ద‌గ్గ‌రున్న డ‌బ్బుల‌ను వాడుకోమ‌ని చెప్పాను. క‌నీసం షేర్ కూడా అడ‌గ‌లేదు. అలా 2018 వ‌ర‌కు 4 కోట్ల‌ను పోగొట్టుకున్నాను. ఒక‌ప్పుడు నా ద‌గ్గ‌ర కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు క్యాబ్‌లో తిరుగుతున్నాను అని ఏడ్చేశారు. ఆ స‌మ‌యంలో వ‌రల‌క్ష్మి, జ‌య‌ల‌లిత‌ను ఓదార్చుతున్నా ఆమె త‌ట్టుకోలేక‌పోయారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు