‘అర్జున్ రెడ్డి‘ రీమేక్ ‘వర్మ’ సినిమాపై దర్శకుడు బాల సెన్సేషనల్ కామెంట్స్..
అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ సినిమా ఆగిపోవడం.. పూర్తైన సినిమాను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాల లాంటి సంచలన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విక్రమ్ విడుదల చేయొద్దని చెప్పడం కూడా ఇప్పుడు సంచలనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై ఏకంగా దర్శకుడు బాల నోరు విప్పాడు.
అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ సినిమా ఆగిపోవడం.. పూర్తైన సినిమాను తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాల లాంటి సంచలన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విక్రమ్ విడుదల చేయొద్దని చెప్పడం కూడా ఇప్పుడు సంచలనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై ఏకంగా దర్శకుడు బాల నోరు విప్పాడు. అసలు ఎందుకు వర్మ సినిమా ఆగిపోయిందో క్లారిటీ ఇచ్చాడు. మరో వారం రోజుల్లోనే సినిమా విడుదలవుతుందనగా ఇప్పుడు వద్దని చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది.

తను తీసుకున్న సొంత నిర్ణయంతోనే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు బాల. కావాలనే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చాను.. ఇంతకంటే తాను ఎక్కువగా ఇంకేం మాట్లాడలేనని చెప్పాడు బాల. ఇక విక్రమ్ తనయుడు ధృవ్ కెరీర్ తో ముడిపడిన విషయం కాబట్టి.. అతన్ని దృష్టిలో పెట్టుకుని ఏం మాట్లాడటం లేదని ఇష్యూ ఇక్కడితో ముగించేసాడు బాల. ఇప్పుడు బాల చెప్పడంతో ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయాలని అందర్నీ కోరుతున్నాడు బాల.
తన సొంత ప్రొడక్షన్ హౌస్ బి ఫిలిమ్స్.. వర్మ ప్రొడక్షన్ హౌజ్ ఈ4 ఎంటర్టైన్మెంట్స్ కు మధ్య ఉన్న ఒప్పంద పత్రాన్ని కూడా జత చేసాడు బాల. ఇక నుంచి వాళ్లతో తనకు సంబంధం లేదని తేల్చేసాడు ఈ దర్శకుడు. ఇది పూర్తిగా ధృవ్ కెరీర్ విషయం కాబట్టి ఎక్కువగా మాట్లాడితే ఆ కుర్రాడి కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందంటున్నాడు బాల. మొత్తానికి ఆయన క్రియేటివ్ ఫ్రీడమ్ పై దెబ్బ పడ్డందుకే బాల బయటికి వచ్చాడని తెలుస్తుంది. ఈయన మాటలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

వర్మ దర్శకుడు బాల

Loading...