‘అర్జున్‌రెడ్డి'ని దర్శకత్వం వహించనున్న గౌతమ్ మీనన్

తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా  విజయ్‌కు ఎంత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో విజయ్ తన నటనలోని సత్తాను ప్రపంచానికి చాటాడు. ఆ సినిమాను పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. అర్జున్ రెడ్డిని తమిళ్‌లో కూడా వర్మ అనే పేరుతో తీస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా సరిగా రావట్లేదని.. ఆపేశారు.

news18-telugu
Updated: February 12, 2019, 6:21 AM IST
‘అర్జున్‌రెడ్డి'ని దర్శకత్వం వహించనున్న గౌతమ్ మీనన్
‘అర్జున్‌రెడ్డి'ని దర్శకత్వం వహించనున్న గౌతమ్ మీనన్
news18-telugu
Updated: February 12, 2019, 6:21 AM IST
తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా  విజయ్‌కు ఎంత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో విజయ్ తన నటనలోని సత్తాను ప్రపంచానికి చాటాడు. ఆ సినిమాను పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా..ఈ సినిమాను హిందీలో కూడా షాహిద్ కపూర్ హీరోగా, కియారా అద్వాని హీరోయిన్‌గా కబీర్ సింగ్‌ అనే పేరుతో తీస్తున్నారు. తమిళ్‌లో కూడా..విక్రమ్ తనయుుడు..ధ్రవ్ హీరోగా వర్మ పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. బాలా దర్శకత్వంలో వస్తున్న వర్మ అనుకున్నంతగా రాలేదని..సినిమాను ఆపేశారు. ఇప్పుడు అదే సినిమాను..అదే హీరోతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ తన కొడుకు మొదటి సినిమా అదిరిపోవాలనీ..ఈ సినిమాకు గౌతమ్ మీనన్ అయితే సరిగా తీస్తాడని భావించడమే ఈ మార్పుకు కారణం. అంతేకాకుండా..గౌతమ్ కూడా తన సినిమాలను చాలా స్టైలిష్‌గా తీస్తాడు..సో..ఇది కూడా ధ్రువ్ సినిమాకు పనికి వస్తుందని భావిస్తున్నారు సినిమా నిర్మాతలు.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ హాట్ ఫోటోస్


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...