Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 9, 2019, 3:22 PM IST
ఆదిత్య వర్మ ఫైల్ ఫోటో
‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. కొత్త దర్శకుడు వచ్చి ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాడని కనీసం ఎవరూ ఊహించలేదు కూడా. కానీ సందీప్ రెడ్డి దెబ్బకు ట్రెండ్ కదిలిపోయింది. సినిమా వచ్చి రెండేళ్లు గడిచినా కూడా ‘అర్జున్ రెడ్డి’ సెగలు ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే హిందీలో రప్ఫాడించింది కబీర్ సింగ్. ఇప్పుడు ఈ చిత్రం తమిళనాట రీమేక్ అవుతుంది. అక్కడ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ఓ సారి సినిమాను పూర్తి చేసి ఆపేసి మళ్లీ ఇప్పుడు రెండో సారి సినిమాను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఆదిత్య వర్మ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది.

ఆదిత్య వర్మ ఫైల్ ఫోటో
ముందు బాల దర్శకత్వంలో వర్మగా వచ్చింది ‘అర్జున్ రెడ్డి’. ఈ కారెక్టర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవర్ అయ్యాడు. అయితే ఈ సినిమా నచ్చకపోవడంతో మరోసారి గిరీశయ్య అనే కొత్త దర్శకుడితో సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సారి క్రియేటివిటీ వాడకుండా.. ఉన్నది ఉన్నట్లు దించేసారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. తెలుగులో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండను చూసిన కళ్లతో అక్కడ ధృవ్ విక్రమ్‌ను చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ధృవ్ కచ్చితంగా నచ్చేలా ఉన్నాడు. ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిందిప్పుడు.

విజయ్ దేవరకొండ వర్మ
సెప్టెంబర్ 27న ఆదిత్య వర్మను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మనం విజయ్ దేవరకొండను చూసాం కాబట్టి ఆ మత్తు తెలియట్లేదు కానీ తమిళ వాళ్లు మాత్రం ధృవ్ కృష్ణకు ఫిదా కావడం ఖాయం. అయితే అర్జున్ రెడ్డిని సేమ్ టూ సేమ్ కాదు.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడు గిరీశయ్య. రిస్క్ తీసుకోకుండా ఉన్నదున్నట్లు తీస్తే ఏ సమస్యా ఉండదని ఫిక్స్ అయిపోయాడు దర్శకుడు. అందుకే ప్రయోగాలకు పోకుండా అప్పుడు అర్జున్ రెడ్డి టీజర్ ఎలా ఉందో ఇప్పుడు ఆదిత్య వర్మ టీజర్ అలాగే ఉంది. ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు, హిందీల్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి తమిళనాట ఏం చేస్తుందో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 9, 2019, 3:22 PM IST