మరోసారి జత కట్టనున్న అర్జున్ రెడ్డి జంట

 హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర లేదు.  ఈ సినిమాతో ఇటు విజయ్‌కు అటు హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి పేరు దాంతో పాటు అవకాశాలు వచ్చాయి.

news18-telugu
Updated: March 9, 2019, 7:01 AM IST
మరోసారి జత కట్టనున్న అర్జున్ రెడ్డి జంట
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే
  • Share this:
హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర లేదు.  ఈ సినిమాతో ఇటు విజయ్‌కు అటు హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి పేరు దాంతో పాటు అవకాశాలు వచ్చాయి.. తెలుగు తెరపై కొత్త ముద్ర వేసింది ఈ సినిమా. ఈ సినిమాకి అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల ప్రశంసలే కాక విమర్శకుల ప్రశంసలు లభించాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన విషయ తెలిసిందే. విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే తెరపై ఎక్కడా కనపడలేదు , కేవలం.. అర్జున్‌, ప్రీతి పాత్రలు తప్ప. ఆ విధంగా.. వీరిద్దరి మధ్యగాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించిన తీరు యువ ప్రేక్షకులకు ఎంతోగాను నచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారని  తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం షాలినీ పాండేని తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. క్రీడా నేపథ్యంలో సాగే  ఈ సినిమాలో విజయ్‌ ఓ రేసర్‌ పాత్రలో కనిపిస్తాడని టాక్.
మతులుపోగొడుతున్న లక్ష్మీ రాయ్ అందాలు
First published: March 9, 2019, 6:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading